Hyderabad: వెబ్‌సిరీస్ చూసి ఆరితేరాడు.. మనుషులనూ పెట్టుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్..!

|

Feb 16, 2022 | 12:12 PM

Hyderabad: డబ్బు సంపాదన కోసం కిడ్నాప్‌లు చేస్తున్న ఓ కేటుగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: వెబ్‌సిరీస్ చూసి ఆరితేరాడు.. మనుషులనూ పెట్టుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్..!
Follow us on

Hyderabad: డబ్బు సంపాదన కోసం కిడ్నాప్‌లు చేస్తున్న ఓ కేటుగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడి గురించి పోలీసులు జరిపిన విచారణలో వెలుగు చూసిన సంచలన విషయాలు చూసి పోలీసులే ఖంగుతిన్నారు. ఇంతకీ అతను ఏం చేశాడు? అతని చరిత్ర ఏంది? పోలీసులు ఎందుకు షాక్ అయ్యారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెస్ట్ జోన్ డిసిపి డి జోయెల్ డేవిస్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం..

లైఫ్ బిందాస్‌గా ఉండాలి.. జల్సాలు చేయాలి.. చేతినిండా డబ్బులు ఉండాలి.. కానీ కష్టపడొద్దు. ఇందుకోసం ఏం చేయాలా? అని ఆలోచిస్తూ వెబ్ సిరీస్‌లు చూశాడు. అందులో కిడ్నాప్ సన్నివేశం చూసి బాగా ప్రేరణ పొందాడు. ఇంకేముంది.. ఇదేదో బాగానే ఉందిగా అని ఫిక్స్ అయ్యాడు. డబ్బులు సంపాదనకు ఇంతకంటే మంచి మార్గం ఉండదని భావించాడు. అయితే, కిడ్నాప్ చేయాలంటే తనకు ముఠా కావాలని భావించి.. అందుకు అవసరమైన నేరగాళ్లను రిక్రూట్‌మెంట్ చేసుకున్నాడు. ఒక మహిళ సహా ఇతర వ్యక్తులను తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు. అయితే, పెద్ద పెద్ద వాళ్ల జోలికి వెళ్లకుండా సామాన్యులను బెదిరించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అమాయకులను కిడ్నాప్ చేసి.. వారి కుటుంబాలను బెదిరించడం డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు.

తాజాగా ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు.. అతని తల్లిదండ్రులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఆ చిన్నారి తల్లి తమ చిన్న కొడుకు కనిపించడం లేదంటూ ఫిబ్రవరి 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు సురేష్, తన స్నేహితుల సర్కిల్‌లోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ కిడ్నాప్‌లు చేసినట్లు గుర్తించారు. నిందితుడు తన స్నేహితుల సర్కిల్‌లోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అద్దెకు తీసుకున్న మహిళల సహాయంతో వారి విశ్వాసాన్ని పొందేందుకు సోషల్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా వాయిస్ మెసేజ్‌లు, టెక్ట్స్ మెసేజ్‌లు పంపి వారిని ప్రేరేపించేవాడు. అలా వారి పిల్లలను కిడ్నాప్ చేయించి.. డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు సురేష్, మహిళ సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Guru Ravidass Jayanti: గురు రవిదాస్ జయంతి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ..

Viral Video: ఇదెందయా ఇది.. బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా ఈ మొసలి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Andhra Pradesh: 8 బృందాలు.. 90 రోజుల వేట.. లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషణ.. ఎట్టకేలకు పట్టుబడ్డ ఆ ఒక్కడు..