రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించక పోవడం అని నిపుణులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎం.ఇ.ఐ.ఎల్ ఫౌండేషన్ , సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పింక్ పవర్ రన్ ను ఆదివారం (సెప్టెంబర్ 29న) గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు.
వయస్సు, శరీర దారుడ్యాల అనుగుణంగా 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ . మారథాన్ లు నిర్వహించనున్నారు. ఈ మారథాన్ లు గచ్చిబౌ లి స్టేడియంలో ప్రారంభమై .. దూరానికి అనుగుణంగా ఓల్డ్ ముంబయి జాతీయ రహదారి, ఐఎస్‌బీ రోడ్, టి ఎన్ ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి గచ్చిబౌలి స్టేడియంలో ముగుస్తాయి.
ఈ పింక్ మారథాన్‌లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక న్యూట్రిషన్ కిట్ల ను అందించనున్నారు. అంతేకాదు రేసుకు ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను తెలియజేయనున్నారు. మారథాన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వారికి మెడల్స్ ను అందించనున్నారు.
ఈ రన్‌లో పాల్గొనేందుకు వేలాది మంది ఔత్సాహికులు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ రోజు (శనివారం) గచ్చి బౌలి స్టేడియం వద్ద తమ పేర్లతో ఉన్న బ్యాడ్జీలతో పాటు టి-షర్టులు మొదలైనవి వాటిని పింక్ పవర్ రన్ మారథాన్ లో పాల్గొనే వారు తీసుకున్నారు. అంతేకాదు ఈ పింక్ పవర్ రన్ మారథాన్ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల నుంచి పెద్దల వరకూ వేలాది మంది పాల్గొననున్నారు. పింక్ కలర్ దుస్తులతో ముస్తాబైన వీరు అందరూ కలిసి గచ్చిబౌ లి స్టేడియంలో పక్షి రూపంలో మానవహారంగా ఏర్పడనున్నారు. ఇలా పక్షిరూపంలో ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..