TSPSC: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం.. అడ్డుకున్న పోలీసులు..

|

Mar 17, 2023 | 3:34 PM

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ దగ్గర హైటెన్షన్‌ నెలకొంది. TSPSC పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఆ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది యూత్‌కాంగ్రెస్. దాంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు గాంధీభవన్‌కు భారీగా చేరుకున్నారు.

TSPSC: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం.. అడ్డుకున్న పోలీసులు..
Tspsc Nsui
Follow us on

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ దగ్గర హైటెన్షన్‌ నెలకొంది. TSPSC పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఆ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది యూత్‌కాంగ్రెస్. దాంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు గాంధీభవన్‌కు భారీగా చేరుకున్నారు. టీఎస్‌పీఎస్సీ వైపునకు బయల్దేరారు. అయితే, ఎన్‌ఎస్‌యూఐ పిలుపు నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. గాంధీభవన్ గేట్లు మూసివేశారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే కొందరు కార్యకర్తలు గేట్లు దూకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమను అడ్డుకున్న పోలీసులతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు వాగ్వాదానికి దిగారు. గేట్లు దూకి.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు. దాంతో ఇటు గాంధీ భవన్, అటు టీఎస్‌పీఎస్సీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బండి సంజయ్ సంచలన ఆరోపణలు..

మరోవైపు.. బీజేపీ, బీఎస్‌పీ నేతలు కూడా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై భారీ నిరసనకు పిలుపునిచ్చారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి ప్రయత్నించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌లీకేజీ వ్యవహారంపై పోరాటన్ని ఉద్ధృతం చేసింది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కమిషన్ ముట్టడికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గన్‌పార్క్‌ నుంచి పార్టీ శ్రేణలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బీజేపీ ఆఫీస్‌ నుంచి ర్యాలీగా గన్‌పార్క్ వద్దకు వచ్చారు బండి సంజయ్.. అక్కడ అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత ధర్నాకు దిగారు. టీఎస్‌పీఎస్‌సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్డితో విచారణకు డిమాండ్ చేశారు. కమిషన్‌ను వెంటనే రద్దు చేసి.. ఛైర్మన్‌తోపాటు సభ్యులను కూడా విచారించాలన్నారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను కూడా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బండి. టీఎస్‌పీఎస్‌సీకి ఎందుకు వెళ్లకూడదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అక్కడి వెళ్లిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే స్వయంగా టీఎస్‌పీఎస్‌సీకి వెళ్తానంటూ సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..