మెట్రో రైల్‌లో ప్రయాణించే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకు ‘లాయల్టీ బోనస్’ ప్రకటించింది. విశ్వసనీయ కస్టమర్ల పేరుతో కొన్ని స్మార్ట్ కార్డ్ ఐడీల లిస్ట్‌ను విడుదల చేసింది. మెట్రో అధికారులు విడుదల చేసిన ఈ ఐడీ ల ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. అధికారులు విడుదల చేసిన ఈ ఐడీ లలో ఎవరివైనా సరిపోలితే సమీపంలోని మెట్రో స్టేషన్ అధికారులను సంప్రదించాలని కోరింది.
‘‘మీ ID లు విడుదల చేసిన ఐడీ నెంబర్లతో సరిపోలుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ నెంబర్ సరిపోలినట్లయితే.. మీ వివరాలను మాకు పంపించింది. 040-23332555కు కాల్ చేయండి, 7995999533లో వాట్సాప్ చేయండి” అని హైదరాబాద్ మెట్రో తెలిపింది. మీ వివరాలను నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు పంపించాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..