Hyderabad: నగరంలో ఈ ఏడాది మొదటి వర్షం పడే రోజు ఏదో తెలుసా..?

అమ్మో చలి. స్వెట్టర్లు ఆగడం లేదు. బ్లాంకెట్లు, దుప్పట్లు కప్పుకున్నా.. వణుకు తగ్గట్లేదు. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తీవ్రమైన చలితో పాటు విపరీతంగా కురుస్తోన్న మంచు.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే ఈ వారంలో హైదరబాద్ నగరంలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపాడు.

Hyderabad: నగరంలో ఈ ఏడాది మొదటి వర్షం పడే రోజు ఏదో తెలుసా..?
Rain Alert

Updated on: Jan 12, 2026 | 2:41 PM

హైదరాబాద్‌లో చలి చంపేస్తుంది. గత కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోంది. చలి, పొగమంచు కారణంగా.. రోజువారీ పనుల కోసమే ఉదయం బయటికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని.. భారత వాతావరణ శాఖ (IMD)  అంచనా వేసింది.

అయితే జనవరి 14, బుధవారం నాడు హైదరాబాద్‌లో 2026 సంవత్సరంలో తొలిసారిగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ రిపోర్ట్ అందుతుంది. తెలంగాణ వెదర్ మ్యాన్.. ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు పేరుగాంచిన టి. బాలాజీ తన ఎక్స్ హ్యాండిల్‌లో లేటెస్ట్ వెదర్ అప్ డేట్స్ పంచుకున్నాడు.  బలహీనపడిన అల్పపీడనం, ఉప-ఉష్ణమండల జెట్ స్ట్రీమ్‌తో ప్రభావంతో.. జనవరి 14న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకావం ఉందని పేర్కొన్నాడు. అయితే, తెలంగాణ జిల్లాలకు ఐఎండీ హైదరాబాద్ ఇప్పటివరకు ఎటువంటి వర్ష సూచనలను జారీ చేయలేదు. బాలాజీ అంచనాల ప్రకారం.. ప్రధానంగా హైదరాబాద్‌తో సహా పశ్చిమ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రదేశాలలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. 

నగరంలో వర్షాలు కురుస్తాయని బాలాజీ అంచనా వేసినప్పటికీ, వాతావరణ శాఖ ఇప్పటివరకు ఎటువంటి హెచ్చరిక లేదా హెచ్చరిక జారీ చేయలేదు. అయితే, జనవరి 15 వరకు నగరంలో పొగమంచుతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతోంది. ఇక రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..