Paper Leak: ప్రశ్నాప్రత్రాలు లీక్‌ చేసిన స్వాతి కాలేజీ యాజమాన్యం.. నలుగురు నిందితులకు రిమాండ్..

|

Feb 16, 2022 | 7:09 AM

Paper Leak: కాలేజీలో అడ్మిషన్లు పెంచుకోవడానికి పేపర్‌ లీక్‌ చేశారు. ఆఖరికి కటకటలాపాలయ్యారు. కలకలం సృష్టించిన..

Paper Leak: ప్రశ్నాప్రత్రాలు లీక్‌ చేసిన స్వాతి కాలేజీ యాజమాన్యం.. నలుగురు నిందితులకు రిమాండ్..
Follow us on

Paper Leak: కాలేజీలో అడ్మిషన్లు పెంచుకోవడానికి పేపర్‌ లీక్‌ చేశారు. ఆఖరికి కటకటలాపాలయ్యారు. కలకలం సృష్టించిన పేపర్‌ లీకేజీ గురించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని స్వాతి కాలేజ్‌లో గత ఏడాది నుంచి అడ్మిషన్స్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో పాస్ చేయించి, కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ పెంచుకోవాలనుకుంది కాలేజీ యాజమాన్యం. అందుకు పెడదారిలో ప్లాన్ చేసింది. తెలంగాణలో జరిగిన పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ చేసింది స్వాతి కాలేజీ యాజమాన్యం. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, పరీక్షకు అరగంట ముందు ప్రశ్నాపత్రం లీక్ అయిందని, అది కూడా స్వాతి కాలేజీ నుంచే జరిగిందని గుర్తించారు పోలీసులు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. తాజాగా వారిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ముగ్గురు కాలేజ్ సిబ్బందితో పాటు అబ్జర్వర్‌ను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఈ నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

స్వాతి కాలేజ్ సిబ్బంది కృష్ణమూర్తి, సముద్రాల వెంకటేశ్వర్లు, కీశెట్టి కృష్ణమోహన్, అబ్జర్వర్ మంద వెంకటరామిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు రాచకొండ పోలీసులు. పరీక్షకు అరగంట ముందే స్వాతి కాలేజ్‌ యాజమాన్యం పేపర్‌ను లీక్ చేసి, వారి విద్యార్థులకు పంపింది. దాన్ని స్వాతి కళాశాల విద్యార్థులు తమ స్నేహితులకు వాట్సప్‌లో పంపారు. దీంతో ఈ పేపర్‌ లీక్‌ ఘటన వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌లోని ఓ కాలేజీలో పరీక్ష సమయం దాటినా హాల్‌లోకి రాకుండా సెల్‌ఫోన్లు చూస్తూ కూర్చున్నారు విద్యార్థులు. ఆ తర్వాత వచ్చి వేగంగా పరీక్ష రాశారు. అక్కడ పనిచేస్తున్న లెక్చరర్లకు అనుమానం వచ్చి విద్యార్థుల సెల్‌ఫోన్లు తనిఖీ చేయగా, ప్రశ్నపత్రాలు కనిపించాయి. ఆ ప్రశ్నపత్రం కోడ్‌ స్వాతి కాలేజీకి చెందినదిగా గుర్తించి, స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అధికారులకు సమాచారమిచ్చారు. వారు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read:

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా?.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Bank Fraud Case: భారీ కుంభకోణం.. ఏబీజీ షిప్‌యార్డు చైర్మన్‌పై సహా 8 మందికి లుక్‌అవుట్‌ నోటీసులు

Vishwak Sen: అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి మరో స్పెషల్ సాంగ్.. ఓరోరి సిన్నవాడా..