AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం ఇది క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ స్లోగన్ అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దవారి వరకు డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటారు. అయితే ఈ చాక్లెట్ చుట్టూ నెట్టింట తీవ్ర వివాదం నడుస్తోంది. డైరీ మిల్క్ చాక్లెట్లు సురక్షితం కాదని.. వీటిని తినొద్దని ఓవైపు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి హైదరాబాద్ అమీర్ మెట్రో స్టేషన్ వద్ద క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడు.

బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
Dairy Milk Chocolate
Peddaprolu Jyothi
| Edited By: Srikar T|

Updated on: May 01, 2024 | 7:40 PM

Share

మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం ఇది క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ స్లోగన్ అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దవారి వరకు డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటారు. అయితే ఈ చాక్లెట్ చుట్టూ నెట్టింట తీవ్ర వివాదం నడుస్తోంది. డైరీ మిల్క్ చాక్లెట్లు సురక్షితం కాదని.. వీటిని తినొద్దని ఓవైపు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి హైదరాబాద్ అమీర్ మెట్రో స్టేషన్ వద్ద క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడు. తీరా కవర్ తీసి తిందామనకునే సరికి అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో ఆయన జీహెచ్ఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేసిన షాపుపై అధికారులు దాడులు చేశారు. ఫిర్యాదు దారుడు కొనుగోలు చేసిన చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ కంపెనీకి చెందిన చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి అంత సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ అభిప్రాయపడుతూ ఇటీవల ఓ రిపోర్టును విడుదల చేసింది. డైరీ మిల్క్ చాక్లెట్లు సురక్షితం కాదని వీటిని తినొద్దని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు గతంలోనూ హెచ్చరించారు. అయితే తాజాగా హైదరాబాదీ పిల్లా అనే నెటిజన్ డైరీ మిల్క్ చాక్లెట్‌ను కోనుగోలు చేశారు. తీరా తిందామని కవర్ తెరిచి చూస్తే ఫంగస్ కనిపించడంతో షాక్ అయ్యింది. ఈ క్రమంలోనే నెటిజన్ ఎక్స్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేశారు. అయితే హైదరాబాదీ పిల్లా ఇదంతా (ట్విట్టర్) ఎక్స్ ఖాతాలో ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 ఉందని, తయారీ తేదీ నుంచి 12 నెలల వరకు దాని ఎక్స్‌పైరి డేట్ ఉందని పేర్కొన్నారు. కానీ చాక్లెట్ తెరిచి చూస్తే ఇలా ఉందని, దీన్ని చూడండి అంటూ డైరీ మిల్క్‌కు ట్విట్టర్‌లో ఫోటోలతో సహా ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన డైరీ మిల్క్ చాక్లెట్‎లో కూడా తేడా కనిపించిందని కంపెనీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

గతంలో ఫిబ్రవరి 9న అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో రాబిన్ అనే ఓ వ్యక్తి స్థానికంగా ఓ షాపులో క్యాడ్‌బెరీ కంపెనీకి చెందిన డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. అయితే, కవర్ విప్పి చూడగా.. లోపల ఓ పురుగు కదులుతూ కనిపించింది. షాక్‌కు గురైన రాబిన్.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన బీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వినియోగదారుడు రాబిన్ కొన్న షాపులో తనిఖీలు నిర్వహించి, చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఈ పరీక్షల రిపోర్టును విడుదల చేసింది. ఆరోగ్యానికి హాని చేసే కారకాలను గుర్తించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో క్యాడ్‌బరీ సంస్థ వివరణ ఇచ్చింది. తమ ఉత్పత్తులలో ఎటువంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్ధాలు లేవని.. పూర్తి సురక్షితం అని స్పష్టం చేసింది. అంతేకాదు ఇతర ఆహార పదార్ధాలను తయారు చేసే సమయంలో ఏ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తామో అదే విధంగా ఇతర ఆహార పదార్ధాల తయారీలో కూడా పాటిస్తామని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

అయితే తరుచు క్యాడ్ బరీ కంపెనీ చాక్లేట్స్ డైరీ మిల్క్‎పై ఏదొక వివాదం నడుస్తుండడంతో వివాస్పదంగా మారుతుంది. కాగా ఈ వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ఈ క్యాడ్ బరీ సురక్షితం కాదని అధికారులు హెచ్చరించిన కూడా ఇంకా కొంత మంది తింటున్నారు. చిన్నపిల్లలకు చాక్లెట్స్ అలవాటు చెయ్యవద్దని, అలవాటు ఉన్నవాళ్ళకి చాక్లెట్స్ మనిపిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..