రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలాపడ్డా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయా అంటే..! అవుననే సమాధానం వస్తుంది. దీనికి తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారు తీగల కృష్ణారెడ్డి.
సోమవారం(అక్టోబర్ 7) తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీహెచ్ మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాగా, తాను మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు. అయితే తాను టీడీపీలో వందశాతం చేరతానంటూ తీగల కృష్ణారెడ్డి ప్రకటించిన సమయంలో.. ఆయన పక్కనే మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు. కానీ, ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు మల్లారెడ్డి. అయితే భేటీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
మరి తెలంగాణలో టీడీపీ వ్యూహం ఫలిస్తుందా? తీగల కృష్ణారెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి..? అసలు తెలంగాణలో సైకిల్‌కి స్పెస్ ఉందా..? ఇప్పడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..