Hyderabad: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. వైద్యులు ఎలా తొలగించారంటే..

|

May 15, 2024 | 12:04 PM

గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముకను ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల వృద్దుడి గుండె దగ్గర అన్నవాహికలో ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. ఈ ఎముక గత నెలరోజులుగా శ్రీరాములు అనే రోగి గొంతులోనే ఇరుక్కుని ఉంది.

Hyderabad: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. వైద్యులు ఎలా తొలగించారంటే..
Mutton Bone
Follow us on

గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముకను ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల వృద్దుడి గుండె దగ్గర అన్నవాహికలో ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. ఈ ఎముక గత నెలరోజులుగా శ్రీరాములు అనే రోగి గొంతులోనే ఇరుక్కుని ఉంది. దీంతో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. కక్కిరెన్ గ్రామానికి చెందిన శ్రీరాములు ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోవడం వల్ల ఈ సమస్యను కొనితెచ్చుకున్నట్లు చెబుతున్నారు వైద్యులు. మటన్ తింటూ పొరపాటున 3.5 సెంటీమీటర్ల ఎముకను మింగేశాడు శ్రీరాములు. మొదట్లో అన్నం సరిగ్గా తినలేక పోవడానికి కారణం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని తప్పుగా నిర్ధారించారు కొందరు వైద్యులు. అయితే శ్రీరాములు సమస్య రోజు రోజుకు తీవ్రతరం కావడంతో కామినేని ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు వచ్చాడు.

అతని పరిస్థితిని గమనించిన వైద్యులు ఎండోస్కోపీ చేయాలని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది చెప్పిన పరీక్షలు చేయించుకునేందుకు సిద్దమయ్యాడు శ్రీరాములు. వైద్య పరీక్షల్లో ఎముక అడ్డంగా ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి దానిని బయటకు తీయాలని చెప్పారు డాక్టర్ నిట్టాలా. ఆపరేషన్‎కు అంగీకరించిన బాధితుడు శ్రీరాములుకు ప్రత్యేక వైద్య బృందం ప్రత్యేక శ్రద్ద తీసుకుని జాగ్రత్తగా సర్జరీ చేశారు. ఆహార వాహికలో అడ్డుగా ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. శ్రీరాములు రికవరీకి అవడం కోసం కొన్ని రోజులు ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. తనకు ఉన్న సమస్యను తొలగించిన డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలుపుకున్నాడు శ్రీరాములు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…