AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్సీని టార్గెట్ చేసిన డీప్‌ఫేక్ గ్యాంగ్.. రూ.5 కోట్లకు బేరం.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్..!

సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తామంటూ తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను బెదిరించిన ముఠా గుట్టురట్టు అయ్యింది. ఎమ్మెల్సీ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాలోని ఆరుగురు నిందితులను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు ప్రాణహాని చేస్తామని బెదిరించి తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఎమ్మెల్సీని టార్గెట్ చేసిన డీప్‌ఫేక్ గ్యాంగ్.. రూ.5 కోట్లకు బేరం.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్..!
Deepfake Blackmail Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 06, 2026 | 8:33 PM

Share

హైదరాబాద్: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తామంటూ తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను బెదిరించిన ముఠా గుట్టురట్టు అయ్యింది. ఎమ్మెల్సీ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాలోని ఆరుగురు నిందితులను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు ప్రాణహాని చేస్తామని బెదిరించి తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మొత్తం 14 మందికి పైగా కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌కి సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.5 లక్షలు వసూలు చేయడంతో పాటు మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.

నవంబర్ 5వ తేదీన ఫాతిమా బేగం అలియాస్ రీమా మరో ఐదుగురితో కలిసి ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లి నగదు అందుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నగదు తీసుకుని వెళ్తున్న సమయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో నిందితుడు మహ్మద్ మొహ్సిన్ ఖాన్‌ను కూడా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.4.70 లక్షల నగదు, రెండు ఆటోలు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ-1తో పాటు ఏ-4 నుంచి ఏ-9, ఏ-14 వరకు మరికొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడితే డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిల్..!
డీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిల్..!
దీపావళికి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ ఇవే!
దీపావళికి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ ఇవే!
బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్
ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి
ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి
తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా?జబర్దస్త్‌ ఫైమాపై విమర్శలు
తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా?జబర్దస్త్‌ ఫైమాపై విమర్శలు
కమ్మగా కడుపు నిండా తినాలా? అయితే ఈ రిసిపీ ట్రై చేయండి!
కమ్మగా కడుపు నిండా తినాలా? అయితే ఈ రిసిపీ ట్రై చేయండి!
ఓటింగ్‌లో ఊహించని మలుపులు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
ఓటింగ్‌లో ఊహించని మలుపులు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇవే.. !
CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇవే.. !
యాదాద్రి క్షేత్రంలో భక్తుల ఆకలి తీరుస్తున్న నారసింహుడి కారుణ్యం
యాదాద్రి క్షేత్రంలో భక్తుల ఆకలి తీరుస్తున్న నారసింహుడి కారుణ్యం
వచ్చే ధన్‌తేరస్‌ వరకు బంగారమా? వెండా? దేనిలో ఎక్కువ లాభాలు ?
వచ్చే ధన్‌తేరస్‌ వరకు బంగారమా? వెండా? దేనిలో ఎక్కువ లాభాలు ?