Hyderabad: సైలెంట్‌గా పని కానిచ్చేద్దామనుకున్నారు.. ఇంతలో ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

హైద‌రాబాద్‌లో వరుసగా హవాలా డబ్బు గుట్టురట్టవుతుంది. తాజాగా గాంధీ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో భారీగా హ‌వాలా న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. ట్యాంక్‌బండ్‌కు స‌మీపంలోని

Hyderabad: సైలెంట్‌గా పని కానిచ్చేద్దామనుకున్నారు.. ఇంతలో ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Hyderabad Police

Updated on: Oct 12, 2022 | 9:07 AM

హైద‌రాబాద్‌లో వరుసగా హవాలా డబ్బు గుట్టురట్టవుతుంది. తాజాగా గాంధీ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో భారీగా హ‌వాలా న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. ట్యాంక్‌బండ్‌కు స‌మీపంలోని హోట‌ర్ మారియ‌ట్ వ‌ద్ద రూ. 3.5 కోట్ల హ‌వాలా న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా హ‌వాలా న‌గ‌దును త‌ర‌లిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీన‌గ‌ర్ పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం రావడంతో మారియ‌ట్ హోట‌ల్ దగ్గర పోలీసులు త‌నిఖీలు నిర్వహించారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంక‌టేశ్వర్ అనే వ్యక్తి రూ. 3.5 కోట్ల న‌గదు ఇచ్చాడు. ఆ న‌గ‌దును సైదాబాద్‌లో ఉండే బాలు, మ‌హేంద‌ర్‌కు ఇవ్వాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో పోలీసులు అక్కడికి చేరుకుని త‌నిఖీలు నిర్వహించి, రూ. 3.5 కోట్ల న‌గ‌దుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్లను సీజ్ చేశారు.

అటు ఈనెల 9వ తారీఖున హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ తనిఖీల్లో 79 లక్షల హవాలా డబ్బును పట్టుకున్నారు. రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.
హైదరాబాద్ లోని సంతోష్‌నగర్ నుంచి కాటేదన్ రూట్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు చాంద్రాయనగుట్ట ఎక్స్‌ రోడ్ దగ్గర రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వారిని విచారించగా వాహనాల్లో ఉన్న 79 లక్షల హవాలా డబ్బు పట్టుబడింది.

ఇక ఈ నెల 29న కూడా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో భారీగా హవాలా మనీ పట్టుబడింది. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న షోయబ్ మాలిక్ దగ్గర ఏకంగా కోటీ24 లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యూపీలోని మీరట్‌కి చెందిన షోయబ్ మాలిక్.. ఏడు నెలల క్రితం హైదరాబాద్‌లో పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నాడు. వరుసగా హవాలా మని పట్టుబడడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సెడ్యూల్ వచ్చిన నాటి నుంచే హవాలా డబ్బు పట్టుబడుతుందా అనే అనుమానం పోలీసులకు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..