75th Independence Day 2022: నేడు హైదరాబాద్‌లో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్..

దాదాపు మూడు గంటలపాటు అత్యంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఈ ముగింపు ఉత్సవాలు జరుగనున్నాయి. శంకర్‌ మహాదేవన్‌, శివమణి, పద్మజా రెడ్డి టీమ్‌ శాస్త్రీయ నృత్యం ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.

75th Independence Day 2022: నేడు హైదరాబాద్‌లో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్..
Cm Kcr

Updated on: Aug 22, 2022 | 1:11 PM

75th Independence Day 2022: నేడు హైదరాబాద్‌లో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఎల్‌బీ స్టేడియంలో జరిగే ఉత్సవాలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు హాజరవనున్నారు. వేడుకల్లో 20 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. వేదిక చుట్టూ 22 భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ వేడుకలో భాగంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తెలంగాణ సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్‌ సాధించిన తెలంగాణకు చెందిన క్రీడాకారులను, ఇతర ప్రముఖులను సన్మానించనున్నారు.

దాదాపు మూడు గంటలపాటు అత్యంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఈ ముగింపు ఉత్సవాలు జరుగనున్నాయి. శంకర్‌ మహాదేవన్‌, శివమణి, పద్మజా రెడ్డి టీమ్‌ శాస్త్రీయ నృత్యం ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత పెద్ద ఎత్తున లేజర్‌ షోతో పాటు భారీ ఎత్తున బాణసంచా పేల్చడంతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి