AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Kcr District Tour: జిల్లాల టూర్‌కు సిద్ధమైన సీఎం కేసీఆర్.. మరో మూడు జిల్లాల్లో ఓపెనింగ్స్..

CM Kcr District Tour: సీఎం కేసీఆర్‌ మళ్లీ జిల్లాల టూర్స్‌కి రెడీ అవుతున్నారు. టూర్ షెడ్యూల్‌ ఖరారు కావడంతో చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

CM Kcr District Tour: జిల్లాల టూర్‌కు సిద్ధమైన సీఎం కేసీఆర్.. మరో మూడు జిల్లాల్లో ఓపెనింగ్స్..
Cm Kcr
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2022 | 1:07 PM

Share

CM Kcr District Tour: సీఎం కేసీఆర్‌ మళ్లీ జిల్లాల టూర్స్‌కి రెడీ అవుతున్నారు. టూర్ షెడ్యూల్‌ ఖరారు కావడంతో చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొన్న వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో పర్యటించిన సీఎం.. ఇప్పుడు పెద్దపల్లి, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వీటితోపాటు మరోసారి జిల్లాల టూర్స్‌కి రెడీ అవుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల వికారాబాద్‌, మేడ్చల్ జిల్లాల్లో పర్యటించి కొత్త కలెక్టరేట్స్‌ బిల్డింగ్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. మరో మూడు జిల్లాల్లో ఓపెనింగ్స్‌ రూట్ మ్యాప్‌ సిద్ధమైంది. పెద్దపల్లి, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్నారు కేసీఆర్‌. ఆగస్ట్‌ 29న పెద్దపల్లిలో పర్యటించనున్న సీఎం, కొత్త కలెక్టర్‌ను ఓపెన్ చేస్తారు. సెప్టెంబర్‌ 5న నిజామాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ భవనాలను, సెప్టెంబర్‌ 10న జగిత్యాల కలెక్టరేట్‌ బిల్డింగ్స్‌ను జాతికి అంకితం చేస్తారు.

జిల్లాల పునర్‌ విభజన తర్వాత అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అనేక జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే వికారాబాద్‌, మేడ్చల్ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించారు కేసీఆర్‌. ఇప్పుడు మరో న్యూ కలెక్టరేట్స్‌ రెడీ కావడంతో ప్రారంభోత్సవాలకు రెడీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు కావడంతో పెద్దపల్లి, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్