Hyderabad: దసరా సెలవులకు ఇళ్లకు వెళ్తున్నారా? అయితే, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి..

 దసరా నవరాత్రుల సందర్భంగా స్కూల్స్ కి సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. దింతో పట్టణం నుండి పల్లె బాట పట్టారు నగరవాసులు. దీంతో బస్ స్టాప్స్‌తో సహా రైల్వే స్టేషన్స్‌లో రద్దీతో సందడి వాతారణం నెలకొంది. ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు అందుగ్గాను ఊర్లోకి వెళ్ళేటటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని పండగను సంతోషంగా జరుపుకోవాలని అధికారులు చెప్తున్నారు.

Hyderabad: దసరా సెలవులకు ఇళ్లకు వెళ్తున్నారా? అయితే, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి..
Dussehra Festival

Edited By: Shiva Prajapati

Updated on: Oct 16, 2023 | 7:57 AM

హైదరాబాద్, అక్టోబర్ 15: దసరా నవరాత్రుల సందర్భంగా స్కూల్స్ కి సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. దింతో పట్టణం నుండి పల్లె బాట పట్టారు నగరవాసులు. దీంతో బస్ స్టాప్స్‌తో సహా రైల్వే స్టేషన్స్‌లో రద్దీతో సందడి వాతారణం నెలకొంది. ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు అందుగ్గాను ఊర్లోకి వెళ్ళేటటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని పండగను సంతోషంగా జరుపుకోవాలని అధికారులు చెప్తున్నారు.

3 కమిషనరేట్లలో ప్రజలు దసరా సెలవల నిమిత్తం తమ సొంత గ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఊళ్ళకి వెళ్లేవారు పక్కింటి వాళ్లతో సహా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లల్లో ఉండేటటువంటి నగదు బంగారం వెండి వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని అన్నారు. అదే విధంగా పోలీసులకి సమాచారం అందజేసి వెళితే ఆయా ప్రాంతాల్లో కాలనీలలో పెట్రోలింగ్ మరింత కట్టదిట్టం చేయవచ్చు అని తెలిపారు తెలంగాణ అతిపెద్ద పండుగ అయినటువంటి దసరా పండుగకు పల్లె బాట పట్టారు నగరవాసులు.. నవరాత్రుల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగను నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకుగాను ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించింది.

ఈ పండుగను జరుపుకునేందుకు తమ సొంత ఊర్లకు వెళుతున్నటువంటి వారికి పోలీసులు తగిన జాగ్రత్తలను సూచించారు గతంలో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని చెడ్డి గ్యాంగ్ లాంటి గ్యాంగ్స్ తోపాటుగా ఢిల్లీ యుపి బీహార్ మధ్యప్రదేశ్ నుండి వచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులు ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్గా చేసుకొని దొరికిందంతా దోచుకుని వెళ్తున్నారు ఇవి ఎక్కువ శాతం దసరా లేదా సంక్రాంతి ఎండాకాలం సెలవులలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అందుగ్గాను దసరా సెలవులు ఇవ్వడంతో కాలనీలో చాలా శాతం వరకు ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి ఊరికి వెళ్లేవారు ఇంటి పక్కన వాళ్ళతో చెప్పడంతో పాటుగా ఇంట్లో లైట్ను వేసుకొని ఉంచాలి అంతేకాకుండా డోర్ లాక్ సిస్టం కలిగి ఉండాలి సీసీ కెమెరాలు సైతం ఉంటే మంచిది అని అంటున్నారు పోలీసులు తాము ఊరికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల చేసి దొరికినంత దోచుకొని వెళ్లే దొంగల బారిన పడకుండా ఉండాలి అంటే పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్తే ఆ కాలనీలలో గస్తీని మరింత పెంచుతామని అంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..