కంటతడి పెట్టించిన ఘటన.. దంపతులిద్దరికి ఒకే పాడేలో అంత్యక్రియలు..!

వాళ్ళిద్దరూ దంపతులు.. ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కొంతకాలం క్రితం భర్తకు అనారోగ్యం బారినపడి మంచం నుండి కదలలేని పరిస్థితిలో భార్య సపర్యాలు చేసింది. కొన్ని సంవత్సరాల నుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది. జీవిత భాగస్వామి కోసం ఎన్నో కష్టాలకోర్చుకుంది. కానీ అమె మృతిచెందటం అమెపై ఆ భర్తకున్న ప్రేమ, అమె జీవంలోనే కలిసిపోయేలా చేసింది.

కంటతడి పెట్టించిన ఘటన.. దంపతులిద్దరికి ఒకే పాడేలో అంత్యక్రియలు..!
Couple Death In Jagtial District

Edited By: Balaraju Goud

Updated on: Sep 14, 2025 | 10:07 AM

వాళ్ళిద్దరూ దంపతులు.. ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కొంతకాలం క్రితం భర్తకు అనారోగ్యం బారినపడి మంచం నుండి కదలలేని పరిస్థితిలో భార్య సపర్యాలు చేసింది. కొన్ని సంవత్సరాల నుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది. జీవిత భాగస్వామి కోసం ఎన్నో కష్టాలకోర్చుకుంది. కానీ అమె మృతిచెందటం అమెపై ఆ భర్తకున్న ప్రేమ, అమె జీవంలోనే కలిసిపోయేలా చేసింది. భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది..

జగిత్యాల జిల్లా రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మి, రాజనర్సులకు ఒక కొడుకు. గత ఇరువై ఏళ్లక్రితం రాజనర్సు వృత్తిరీత్యా కనకబొంగులు తీసుకురావటానికి వెళ్లి, కిందపడటంతో గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసినా.. మంచం నుండి లేవలేని పరిస్థితి. ఇరువై ఏళ్లుగా అతని భార్య లక్ష్మి అన్నీతానై అమ్మనాన్నైంది. ఒక భార్యగా.. ఒక స్నేహితురాలిగా.. ఇలా అన్నీ పాత్రలు పోషించి, భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది.

కొంతకాలంగా లక్ష్మి అరోగ్యం దెబ్బతిన్నది. చికిత్స పొందుతూ.. శనివారం (సెప్టెంబర్ 13) రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందింది. భార్యను పిలిచి పిలిచి, తన భార్య తనకు లేదనే మనస్థాపంతో నీ వెంటే నేను వస్తున్నాననంటు భార్యతోపాటు భర్త మృతి చెందాడు. ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధవుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరిని ఒకేసారి పాడేపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కలిసిన్నప్పుడు కష్టాలను కలిసి ఎదుర్కొన్నారు. భర్త క్షేమం కోసం భార్య ఎన్నో త్యాగాలు చేసింది. అలాగే తన భార్య లేదని తెలిసి నువ్వులేని జీవితం నాకొద్దని భర్త కూడా అమెతో వెళ్లిపోవటం ప్రతి హృదయాన్ని తాకింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..