Telangana: ఆ రోడ్డు దాటాలంటేనే గుండెల్లో దడ.. జనాలు చెద్దర్లు కప్పుకుని.. పాపం.!

| Edited By: Ravi Kiran

Jun 11, 2024 | 9:52 AM

ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనాలు దడుసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా పని మీద ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే.. తమ చేతుల్లో చెట్ల కొమ్మలు, చెద్దర్లు, తలపై గంపలు పెట్టుకుని రావాల్సి పరిస్థితి ఏర్పడింది. వినడానికే కొంచెం వింతగా ఉంది కదా.! మేము చెప్పేది నిజమండీ బాబూ.. ఈ రోడ్డు మరెక్కడో లేదు..

Telangana: ఆ రోడ్డు దాటాలంటేనే గుండెల్లో దడ.. జనాలు చెద్దర్లు కప్పుకుని.. పాపం.!
Telangana
Follow us on

ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనాలు దడుసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా పని మీద ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే.. తమ చేతుల్లో చెట్ల కొమ్మలు, చెద్దర్లు, తలపై గంపలు పెట్టుకుని రావాల్సి పరిస్థితి ఏర్పడింది. వినడానికే కొంచెం వింతగా ఉంది కదా.! మేము చెప్పేది నిజమండీ బాబూ.. ఈ రోడ్డు మరెక్కడో లేదు.. మన తెలంగాణలోనే ఉంది. ఆ వివరాలు ఏంటో.?

వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తేనెటీగలు రెండు రోజుల నుండి వచ్చి పోయేవాళ్ల మీద దాడి చేస్తున్నాయి. చందుర్తి ప్రధాన రహదారి పక్కన ఉన్న పెద్ద రావి చెట్టుపై పెద్దపెద్ద తేనెతెట్టలు ఉన్నాయి. ఇక రెండు రోజుల నుండి అటువైపు వస్తున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, స్థానిక ప్రజలపై తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. చందుర్తికి ఇటువైపు రావడానికి ప్రజలు జంకుతున్నారు. మకొందరైతే చెట్ల కొమ్మలు, చెద్దర్లు పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ పరిస్థితి తెలియకుండా సాదాసీదా నడుచుకుంటూ వెళ్తే చాలు.. తేనెటీగలు చుట్టుముట్టి పరుగులు పెట్టిస్తున్నాయి.

రెండు రోజులుగా తేనెటీగల దాడులు కొనసాగుతున్నాయి. బైకులపై, సైకిళ్లపై నడుచుకుంటూ వెళ్లేవారికి ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టి దాడి చేయడంతో పరుగులు పెడుతున్నారు. మరి కొంతమంది బైక్‌పై కిందపడి గాయాలపాలవుతున్నారు. ఏది ఏమైనా రెండు రోజులుగా తేనెటీగలు ఈ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడి రోడ్డు దాటాలంటేనే భయం భయంగా వస్తూ వెళ్తున్నారు. ఇప్పటికి చాలామందిపై తేనెటిగలు దాడి చేశాయి. ఆ పరిసర ప్రాంతంలో ఎవరు ఉండలేకపోతున్నారు. ఇక్కడ తేనెతుట్టెను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..