AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Alert: ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్‌ హై అలెర్ట్‌.. సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు జారీ..!

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. 13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. సోమవారం (నవంబర్ 10, 2025) ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో బాంబు పేలింది. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్చారు.

Hyderabad Alert:  ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్‌ హై అలెర్ట్‌..  సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు జారీ..!
Hyderabad Alert
Balaraju Goud
|

Updated on: Nov 10, 2025 | 9:10 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. 13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. సోమవారం (నవంబర్ 10, 2025) ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో బాంబు పేలింది. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్చారు. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో సమీపంలోని అనేక వాహనాలకు నిప్పు అంటుకుంది. అనేక ఇతర వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు తర్వాత, పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు.

ఇప్పుడక్కడ అత్యంత భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే. సరిగ్గా 6.45నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. కానీ, భారీ పేలుడు జరిగడంతో ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ, చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. మెట్రో స్టేషన్ గేట్‌-1పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన పదినిమిషాల్లోనే అగ్నిమాపక వాహనాలు స్పాట్‌కు చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే పేలుడు ధాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. కాగా, మరణాల సంఖ్య 8కి చేరింది. 20మందికిపైగా గాయపడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..

ఢిల్లీ పేలుళ్ల నేపధ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ మహానగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసలు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. దీంతో ప్రధాన కూడళ్లతోపాటు రైల్వేస్టేషన్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే, ఓల్డ్ సిటీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. మరేవైనా వస్తువులు కనిపించినా సమాచారం ఇవ్వాలని పోలీసు కమిషనర్ సజ్జనార్‌ నగరవాసులను కోరారు. డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..