Telangana: 2024లో ప్రభుత్వ సెలవులు ఇవే..

జనవరి 1, 2024 కొత్త సంవత్సరం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించబడినందున.. ఫిబ్రవరి 2024 రెండవ శనివారం సెలవును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు సెలవు ప్రకటించగా, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పోలీసులు శాంతియుతంగా వేడుకలు జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Telangana: 2024లో ప్రభుత్వ సెలవులు ఇవే..
2024 holidays

Updated on: Dec 30, 2023 | 7:33 PM

2024 సంవత్సరం ఎంటరవ్వడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రభుత్వ సెలవుల తాత్కాలిక జాబితాను ప్రభుత్వం విడుదల  చేసింది. పలు పండగలు, ఇతర సందర్భాల్లో సెలవుల తేదీలు మారవచ్చు.

సెలవుల లిస్ట్…

సెలవు తేదీ రోజు
కొత్త సంవత్సరం జనవరి 1 సోమవారం
మకర సంక్రాంతి జనవరి 15 సోమవారం
గణతంత్ర దినోత్సవం జనవరి 26 శుక్రవారం
మహా శివరాత్రి మార్చి 8 శుక్రవారం
హోలీ మార్చి 25 సోమవారం
మంచి శుక్రవారం మార్చి 29 శుక్రవారం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 శుక్రవారం
ఉగాది ఏప్రిల్ 9 మంగళవారం
ఈద్-ఉల్-ఫితర్ ఏప్రిల్ 10 బుధవారం
ఈద్-ఉల్-ఫితర్ సెలవు ఏప్రిల్ 11 గురువారం
అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 ఆదివారం
రామ్ నవమి ఏప్రిల్ 17 బుధవారం
బక్రీద్/ఈద్-ఉల్-అధా జూన్ 17 సోమవారం
ముహర్రం జూలై 17 బుధవారం
బోనాలు జూలై 31 బుధవారం
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 గురువారం
జన్మాష్టమి ఆగస్టు 26 సోమవారం
గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7 శనివారం
ఈద్-ఎ-మిలాద్ సెప్టెంబర్ 16 సోమవారం
గాంధీ జయంతి అక్టోబర్ 2 బుధవారం
బతుకమ్మ మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం
మహా అష్టమి అక్టోబర్ 11 శుక్రవారం
విజయ దశమి అక్టోబర్ 13 ఆదివారం
దీపావళి అక్టోబర్ 31 గురువారం
గురునానక్ జయంతి నవంబర్ 15 శుక్రవారం
కార్తీక పూర్ణిమ నవంబర్ 15 శుక్రవారం
క్రిస్మస్ రోజు డిసెంబర్ 25 బుధవారం
క్రిస్మస్ హాలిడే డిసెంబర్ 26 గురువారం

 

జనవరి 1, 2024 కొత్త సంవత్సరం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించబడినందున.. ఫిబ్రవరి 2024 రెండవ శనివారం సెలవును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు సెలవు ప్రకటించగా, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పోలీసులు శాంతియుతంగా వేడుకలు జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు, పబ్‌లు, హోటళ్లలో రాత్రి 1 గంట వరకు పార్టీలు జరుపుకోవడానికి ముందుగా పోలీసుల అనుమతిని పొందాలి. దీంతో పాటు నగరంలో నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం జరగకుండా హైదరాబాద్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…