Telangana: గంజాయికి బానిసైన కొడుకు.. స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెట్టిన తల్లి

|

Apr 04, 2022 | 1:45 PM

మత్తు యువతను చిత్తు చేస్తుంది. వారి బంగారు భవిష్యత్‌ను చీకటి మయం చేస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్త పదార్థాల సరఫరా ఆగడం లేదు.

Telangana: గంజాయికి బానిసైన కొడుకు.. స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెట్టిన తల్లి
Ganja
Follow us on

హైదరాబాద్‌(Hyderabad) పబ్‌లో డ్రగ్స్‌ ఇష్యూ హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. ఐతే సూర్యాపేట(Suryapet)లో గంజాయి(Ganja)కి బానిసగా మారిన కొడుకును మార్చుకునేందుకు ఓ తల్లి పడుతున్న కష్టం చూస్తే ప్రతి ఒక్కరి మనసు చలించక మానదు. కోదాడ(Kodad)కు చెందిన 15 ఏళ్ల యువకుడు గంజాయికి బానిసగా మారాడు. ఇంటికి రాకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ గంజాయి సేవిస్తున్నాడు. తల్లి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచక చేతికి దొరికిన కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెట్టింది తల్లి. కన్నీళ్లు పెట్టుకొని చెప్పినా వినడం లేదని..అందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. గంజాయి లేకుండా చర్యలు తీసుకోవాలని..తన కొడుకును ఈ మత్తు బారి నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోందామె.  కోదాడలో ఈ ఒక్క తల్లిదే కాదు. డ్రగ్స్‌, గంజాయికి బానిసలుగా మారిన ప్రతి బిడ్డ తల్లిదీ ఇదే ఆవేదన. చెడు వ్యసనాల బారిన పడిన కొడుకులను ఎలా దారిన పెట్టుకోవాలో తెలియక ఎంతో మంది మథనపడిపోతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే.. అక్కడి పోలీసులు, అధికారులు.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. అలాగే గంజాయికి బానిసలైన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స ఇప్పించాలి.

Also Read:  ఏంట్రా ఇలా తయారయ్యారు.. పులి చర్మం అనుకుంటే మీరు పిచ్చోళ్లే.. మాములు మాయ కాదు

పండింది.. మిర్చి కాదు గోల్డ్.. తులం బంగారం ధరను క్రాస్ చేసిన ఎర్ర బంగారం రేటు