తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

| Edited By:

Jul 19, 2020 | 2:54 PM

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాజాగా మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు..

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Follow us on

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాజాగా మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం-ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగా రెడ్డి, నారాయణ పేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్