పవన్‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్
మళ్లీ పవర్ స్టార్‌తో సినిమా తీస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు బండ్ల. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేస్తూ.. 'పరమేశ్వరుడు అనుగ్రహిస్తే పవన్‌తో సినిమా తీస్తా. పవన్‌తో తీసే సినిమాను ఫ్యాన్స్ ఏడాదిపాటు పండగ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానమని ఎన్నో సార్లు మీడియా వేదికగా పేర్కొన్నారు బండ్ల. ఇప్పటికే పవన్‌తో కలిసి రెండు సినిమాలను చేశారు. ‘తీన్ మార్, గబ్బర్ సింగ్’ వంటి సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవరించారు. అయితే తీన్ మార్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా.. గబ్బర్ సినిమా మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
అనంతరం.. అటు బండ్ల గణేష్, ఇటు పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఫుల్లుగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటు బండ్ల గణేష్ కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. అలాగే బండ్ల గణేష్ క్యారెక్టర్‌కు మంచి మార్కులు పడ్డాయి.
తాజాగా మళ్లీ పవర్ స్టార్‌తో సినిమా తీస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు బండ్ల. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్‌తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. మన పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా. ఇది నా సంకల్పం’ అని ట్వీట్లో పేర్కొన్నారు బండ్ల గణేష్.
ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను.మన పవర్ స్టార్ అభిమానులు ఈ సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా ఇది నా సంకల్పం https://t.co/mSWeTdHTgA
— BANDLA GANESH. (@ganeshbandla) July 19, 2020
Read More:
రేఖాజీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి.. ముంబై మేయర్ వినతి