అలెర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన..

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు సూచించారు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. తెలంగాణ‌‌లోని మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి...

అలెర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 08, 2020 | 3:32 PM

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు సూచించారు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. తెలంగాణ‌‌లోని మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు ప‌డ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 5.8 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం బలహీనపడిన కార‌ణంగా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ప‌డనున్నాయి. అలాగే ఎల్లుండి చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు హైద‌రాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి రాజారావు వెల్ల‌డించారు.