AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా వైర‌స్‌తో ప్ర‌జా గాయ‌కుడు నిసార్ క‌న్నుమూత‌..

ప్ర‌జా గాయ‌కుడు నిసార్ మ‌హమ్మ‌ద్ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్‌తో ఈ రోజు ఉద‌యం ఆయ‌న మృతి చెందారు. గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల‌ను, తెలంగాణ గుండె చ‌ప్పుళ్ల‌ను త‌న పాట‌ల‌తో ఎలుగెత్తి చాటిన...

క‌రోనా వైర‌స్‌తో ప్ర‌జా గాయ‌కుడు నిసార్ క‌న్నుమూత‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 08, 2020 | 2:31 PM

Share

ప్ర‌జా గాయ‌కుడు నిసార్ మ‌హమ్మ‌ద్ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్‌తో ఈ రోజు ఉద‌యం ఆయ‌న మృతి చెందారు. గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల‌ను, తెలంగాణ గుండె చ‌ప్పుళ్ల‌ను త‌న పాట‌ల‌తో ఎలుగెత్తి చాటిన తెలుగు క‌వి, గాయ‌కుడు నిసార్ మ‌హ‌మ్మ‌ద్. మొద‌ట ఆర్టీసీలో కండ‌క్ట‌రుగా, డిపో కంట్రోల‌ర్‌గా ప‌నిచేసిన నిసార్ కొన్ని ద‌శాబ్దాలుగా ప‌లు పాట‌ల‌తో ప్ర‌జా ఉద్య‌మాల‌కు ఊపునిచ్చారు. తాజాగా నిసార్ క‌రోనా వైర‌స్ సృష్టించిన విల‌య‌పై పాట రాసి ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ నాట్య‌మండ‌లి రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నారు. కాగా నిసార్ స్వ‌గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండ‌లంలోని సుద్దాల‌. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న స‌మాజం కోస‌మే పాటుప‌డ్డారు. తెలంగాణ సాధ‌న ఉద్య‌మంలో అనేక ధూంధాంలు నిర్వ‌హించారు. నిసార్ మృతిని సాంస్కృతిక రంగానికి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోట‌ని ప్ర‌జా సంఘాలు సంతాపం వ్య‌క్తం చేశాయి.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!