AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!

యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అన్న అంత్యక్రియల కోసం వచ్చిన చెల్లి సైతం అన్నతో కలిసి తిరిగిరాలి లోకాలకు వెళ్లిపోయింది. అన్న మరణం తట్టుకోలేక అతని మృతదేహం పక్కనే కూర్చొని ఏడుస్తూ చెల్లి కూడా గుండెపగిలి ప్రాణాలు విడిచింది. ఒకే ఇంట్లో ఇద్దరు మరణాలు సంభవించడం స్థానికులను సైతం కన్నీళ్లు పెట్టించింది.

Telangana: మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!
Yadadri Double Tragedy
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 10:18 AM

Share

అన్నను కడసారి చూసేందుకు వచ్చిన ఓ చెల్లికి అదే చివరి చూపైంది! తోడబుట్టిన అన్న మృతితో కన్నీరుమున్నీరైన ఆ చెల్లెలు.. ఆ విషాదాన్ని తట్టుకోలేకపోయింది. అన్న భౌతికకాయం పక్కనే రోదిస్తూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విలపించింది. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. అన్న అంత్యక్రియలు పూర్తికాకముందే.. చెల్లెలి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిన విషాద పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకే ఇంట్లో.. ఒకరి అంతిమయాత్రకు సిద్ధమవుతుండగానే మరో మరణం సంభవించడం.. అందరి కళ్లలో కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన కొత్త మల్లయ్య యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. అన్న మృతిచెందాడన్న వార్త తెలుసుకున్న ఆయన సోదరి.. యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లికి చెందిన చుక వెంకమ్మ వెంటనే రాయగిరికి చేరుకున్నారు. అన్న భౌతిక కాయాన్ని చూసిన వెంకమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు మెదిలాయో.. అన్నను కోల్పోయిన బాధ తట్టుకోలేకపోయారో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు తేరుకునేలోపే వెంకమ్మ కూడా ప్రాణాలు విడిచారు.

ఒకే చోట, రెండు విషాదాలు..

అప్పటికే ఇంట్లో అన్న మల్లయ్య మృతదేహం. అంతలోనే కళ్లముందే సోదరి వెంకమ్మ విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అన్నకు అంతిమ వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న కుటుంబానికి.. అదే సమయంలో చెల్లెలికి కూడా చివరి వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ విషాద ఘటనతో రాయగిరి, దాతారుపల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. కడసారి అన్నను చూసేందుకు వచ్చిన చెల్లెలు.. చివరకు అన్నతోనే తన జీవన ప్రయాణాన్ని ముగించిన విషాదం.. ఈ ఘటనతో స్థానికులు సైతం కళ్ల నీళ్లు పెట్టుకతప్పలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే
ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే
స్పిన్ vs స్పిన్.. లంకను ముంచేయడానికి సిద్ధమైన టీమిండియా త్రిశూలం
స్పిన్ vs స్పిన్.. లంకను ముంచేయడానికి సిద్ధమైన టీమిండియా త్రిశూలం
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!
మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!
వినాయక చవితి.. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహుర్తాలు ఇవే!
వినాయక చవితి.. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహుర్తాలు ఇవే!
ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు
ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు
కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..
కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..
ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లగా..
అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లగా..