AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే కనిపించకుండాపోయింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ!

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి మాయం అయిపోతుంటారు. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతుంటారు. ఇంకొంతమంది సినిమాల్లో కనిపించపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కనువిందు చేస్తుంటారు.

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే కనిపించకుండాపోయింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ!
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2026 | 10:28 AM

Share

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే ఆకట్టుకుని ఆ తర్వాత వెండితెరకు దూరమైపోతుంటారు. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్‌లో ఉంటూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తుంటారు. అలా ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామల్లో సంయుక్త హెగ్డే కూడా ఒకరు. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసిన సినిమా ఒక్కటే అయినప్పటికీ.. తన అందం, అభినయంతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమాతో సంయుక్త హెగ్డే టాలీవుడ్‌కు పరిచయమైంది. కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తెలుగులోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంది. సినిమాలో ఆమె లుక్స్, నటన ప్రేక్షకులను మెప్పించాయి.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

అయితే ఈ సినిమా తర్వాత సంయుక్త హెగ్డే తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. దాంతో టాలీవుడ్‌లో ఆమె కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ.. కన్నడ, తమిళ భాషల్లో మాత్రం సంయుక్త హెగ్డే వరుస అవకాశాలను అందుకుంది. సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ సందడి చేసింది. ముఖ్యంగా కన్నడ బిగ్ బాస్లో పాల్గొనడంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత సంయుక్తకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా ఉంటోంది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సంయుక్త హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది . తరచూ తన ఫ్యాషన్, ఫిట్‌నెస్, గ్లామరస్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంటుంది. తాజాగా కూడా సంయుక్త హెగ్డే షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన స్టైలిష్ లుక్‌తో పాటు అందాలను ఆరబోస్తూ ఈ అమ్మడు చేసిన ఫొటోషూట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us