పోపులో ఆవాలను ఎందుకు వేస్తారో తెలుసా?
samatha
12 september 2026
Pic credit - Pinterest
ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఆవాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా పోపు గింజలుగా మాత్రమే ఉపయోగిస్తారు.
అంతే కాకుండా కొంత మంది వీటితో మసాలా తయారు చేసి ఊరగాయ పచ్చళ్లకు ఉపయోగిస్తుండటం చూస్తుంటాం
అయితే మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆవాలను పోపు గింజలుగా ఎందుకు ఉపయోగిస్తారో, దాన
ి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆవాలు పోపులో వేయడం వలన అవి రుచిని పెంచుతాయి. ముఖ్యంగా నూనెలో వేయగానే చిటపట మంటూ శబ్ధం చేస్తూ ఘుమ ఘుమల రుచిని ఇస్తుంది.
అంతే కాకుండా ఆవాలలో ఉండే సహజ నూనెలు వేడికి విడుదలై కూరలకు ప్రత్యేక ఫ్లేవర్ ఇస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా పోపుకు ఉపయ
ోగిస్తుంటారు.
ఆవాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిని పోపులో ఉపయోగించి తీసుకోవడం వలన ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గ
ిస్తాయి.
అంతే కాకుండా ఆవాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి, అందువలన ఇవి ఆహారం త్వరగా చెడిపోకుండా కాపాడతాయి.
ఆవాలు చూడటానికి చిన్నవే అయినా, పోపులో పేలిన తర్వాత వాటి ఘాటు తగ్గి రుచిగా మారుతాయి. అందుకే వీటిని వంటకాల్లో పోప
ుగానే ఎక్కువగా ఉపయోగిస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?