Telangana: కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతూ.. ఫోర్త్ వేవ్ ముంగిట ఉన్నామా అనే భయభ్రాంతులను కలుగజేస్తోంది. గత కొన్ని రోజులుగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ లో కూడా గత 24 గంటల్లో 600 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా DMHOలతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండమంటూ పలు సూచనలు చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని dmho లకు మంత్రి ఆదేశాలను జారీ చేశారు. బూస్టర్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి అధికారులు, వైద్య సిబ్బంది.. స్థానిక ఎంపీలు, ఎమ్మేల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు మంత్రి హరీశ్ రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..