Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itlu Mee Niyojakavargam: సత్తుపల్లిలో మరోసారి షంషేర్‌ సండ్ర వెంకటవీరయ్యేనా.. గ్రూప్ రాజకీయాలు స్వాగతం పలుకుతున్నాయా..

సత్తుపల్లి నియోజకవర్గం లో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య కు ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయా.. సొంత పార్టీ లో అసమ్మతి, వర్గపోరు ను ఎలా ఎదుర్కుంటారు.. మారిన రాజకీయ సమీకరణాల్లో సత్తుపల్లి లో గెలుపెవరిది.. ఇచ్చిన హామీ లేంటి.. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి.. నియోజకవర్గం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి..

Itlu Mee Niyojakavargam: సత్తుపల్లిలో మరోసారి షంషేర్‌ సండ్ర వెంకటవీరయ్యేనా.. గ్రూప్ రాజకీయాలు స్వాగతం పలుకుతున్నాయా..
Itlu Mee Niyojakavargam Sathupally
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 12, 2023 | 5:51 PM

ఖమ్మం ఖిల్లాలో రాజకీయ ఉద్ధండులను అందించిన చరిత్ర సత్తుపల్లిది. తెలంగాణలో ఉంటూ ఆంధ్రాసరిహద్దు ఎక్కువగా కలిగిన ఈ నియోజకవర్గంలో… ఇప్పటికైతే షంషేర్‌ సండ్ర వెంకటవీరయ్యే. ఎందుకంటే, ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన ఆయన… మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్సీ రిజర్వుడుగా మారిన తర్వాత… తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవాను తట్టుకుని టీడీపీ అభ్యర్థిగా గెలిచారు వీరయ్య. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్‌రావు పై 14వేల 300 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టిన వీరయ్య… 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కూడా… విక్టరీని కంటిన్యూ చేశారు. అయితే, 2014లో సమీప వైసీపీ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ పై 2వేల 300 స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. అయితే, 2018లో మరోసారి విజయం సాధించి సత్తుపల్లిలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. అయితే, టీడీపీ అభ్యర్థిగా 19వేల పైచిలుకు ఓట్లతో గెలిచిన సండ్ర… ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రూటు మర్చారు.

2018ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన సండ్ర… ఆ తర్వాత కారెక్కేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇక, అప్పటినుంచి నియోజకవర్గం లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో సండ్రకు సఖ్యత కుదర్లేదు. ఇప్పటికీ ఈ ఇద్దరు కీలక నేతలు.. ఎవరికివారే అన్నట్టు గ్రూపులు మెయింటెన్‌ చేస్తూ… జిల్లా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు. మట్టా దయానంద్, పిడమర్తి రవిలు పొంగులేటి వర్గంలో ఉండగా… సొంతంగా పర్యటనలు చేస్తూ.. తమ పట్టు నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన మరుక్షణం…. దయానంద్ కూడా గోడదూకేసి ఎన్నికలబరిలో ఉంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వర్గంతోనూ సఖ్యతగా ఉండని సండ్ర వెంకటవీరయ్య… ఏం చేయబోతున్నారనే ఆసక్తి ఏర్పడింది. అయితే, నిత్యం ప్రజలతో మమేకమై ఉంటారన్న పేరుండటం… వీరయ్యకు కలిసొచ్చే అంశం. కానీ, జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతలతో ఉన్న గ్యాప్ .. తప్పక నష్టం చేస్తుందనే వారూ లేకపోలేదు. దీంతో, సండ్రకు నాలుగోసారి విజయం సాధ్యమేనా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

గ్రూప్‌వార్‌తో పరిస్థితి అస్తవ్యవస్థం

అటుకాంగ్రెస్‌లో ఏమైనా సక్కగుందా యవ్వారం అంటే.. అదీ లేదు. గ్రూప్‌వార్‌తో పరిస్థితి అస్తవ్యవస్థంగా తయారైంది. నేతల మధ్య విభేదాలు… వచ్చే ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపే అవకాశం ఉందని కేడర్ ఆందోళన చెందుతోంది. మాజీమంత్రి సంభాని చంద్ర శేఖర్, కోటూరి మానవతారాయి… ఎవరికివారే వర్గాలుగా విడిపోయి, వేర్వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి, కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడిదే హస్తం పార్టీకి పెద్దదెబ్బగా మారే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే సత్తుపల్లిలో ఇటీవల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గతంలో టిడిపికి కంచుకోటగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో… ఇప్పుడా పార్టీ మాజీ నేతలు మళ్లీ యాక్టివ్‌ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల పేరుతో… వాళ్లంతా ఒకటై కార్యక్రమాలు చేస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది. వాటికి తుమ్మల నాగేశ్వర్రావు కూడా హాజరవుతుండటం… రాజకీయంగా కొత్త చర్చలకు ఆస్కారమిస్తోంది. మళ్లీ టిడిపిని యాక్టివ్ చేస్తే.. పాత నేతలందరూ తిరిగి వస్తారనీ… అలా ఖమ్మంలో పార్టీకి ఖచ్చితంగా పునర్ వైభవం వస్తుందనీ ఆశాభావంతో ఉన్నారట హార్డ్‌కోర్‌ సైకిల్‌ ఫ్యాన్స్‌. ఇటీవల చంద్రబాబు సభ తర్వాత.. ఆ నమ్మకం మరింత పెరిగిందనే టాక్‌ వినిపిస్తోంది.

లెఫ్ట్‌ పార్టీలు ఛాన్స్‌ కోసం చూస్తున్నాయా?

ఖమ్మం ఖిల్లాలో ఒకప్పుడు మంచి పట్టున్న ఎర్రన్నలు కూడా మరోసారి యాక్టివ్‌ అయ్యేందుకు కృషిచేస్తున్నారు. కారు పార్టీతో దోస్తానాను… వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లిలో తమ పవరేంటో చూపాలన్న కసితో ఉన్నారు.

అభివృద్ధిలో మార్క్‌ చూపించానంటున్న వీరయ్య

నిత్యం ప్రజలతో మమేకమై ఉంటారు సరే… వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే పేరుంది సరే…. మరి, అభివృధ్ధి సంగతేంటంటే మాత్రం…. తన మార్క్‌ చూపించానంటున్నారు ఎమ్మెల్యే సండ్ర వీరయ్య. సత్తుపల్లి డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు… పెనుబల్లి వరకు హైవే రోడ్డు విస్తరణ పనులు… మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం… తన హయాంలోనే జరగడం దీనికి సాక్ష్యమంటున్నారు. సత్తుపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కొరకు 35కోట్లతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి ప్రస్తుతం నిర్మాణదశలో ఉందనీ… నియోజక వర్గం లోని అంతర్గత బీటీ రోడ్ల నిర్మాణాలు… ప్రతి మండలంలోనూ పూర్తి చేశామనీ.. చెబుతున్నారు.

సంక్షేమానికి, అభివృద్ధి తోడవుతుందా?

మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి చెరువును ఆధునీకరించామన్న ఎమ్మెల్యే… కల్లూరు లో స్టేడియాన్ని నిర్మించామనీ, కమ్యూనిటీ భవనాలూ ఏర్పాటు చేశామనీ చెప్పారు. కేంద్రం నిధులతో సత్తుపల్లికి రైల్వే లైన్ మంజూరు చేయించి.. దీన్ని బొగ్గు రవాణాకోసం అందుబాటు లోకి తీసుకొచ్చామంటున్నారు. ఎలాగూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి… తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే సండ్ర వీరయ్య.

మెగా ఫుడ్‌పార్క్ ఓపెనింగ్‌ ఎప్పుడో?

అయితే, ప్రతిపక్షాల వెర్షన్‌ వేరేలా ఉంది. నియోజవర్గంలో ప్రధాన సమస్యలేవీ పరిష్కా రం కాలేదంటున్నారు. బుగ్గపాడులో కోట్ల రూపాయలతో నిర్మించిన మెగా ఫుడ్ పార్క్ కోసం గిరిజన రైతుల దగ్గర నుండి 200 ఎకరాలు భూమిని తక్కువ రేటుకే కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నాయి. పోనీ, ప్రారంభమైనా అయ్యిందా? అంటే అదీ లేదు. అలా నిర్మించి మూలన పడేసినట్టుగా ఉంది పరిస్థితి.

స్ధానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకూ ఆదిశగా ప్రయత్నాలూ జరగలేదు. సింగరేణితో యాజమాన్యానికి వందల కోట్ల రూపాయల్లో లాభం వస్తోంది. కానీ లోకల్ యువతకు మాత్రం ఉపాధి కరువైంది.

సత్తుపల్లిలో అందని ద్రాక్షగా ఉన్నత విద్య

ఉన్నతవిద్య సత్తుపల్లి విద్యార్థులకు అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వ పీజీ కళాశాల లేదు. ప్రభుత్వ ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీలూ కనిపించవు. పారిశ్రామికంగా నూ అభివృద్ధి కనిపించని పరిస్థితి. సింగరేణి బొగ్గుతో థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే వందలాది యువతకు ఉపాధి దొరుకుతుంది. ఆ దిశగా ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయట్లేదన్న ఆరోపణలున్నాయి.

మైన్‌ బ్లాస్టింగులతో నరకం చూస్తున్న జనం

సింగరేణి బొగ్గు గనులతో స్ధానిక కాలనీ వాసుల బతుకు దుర్బరంగా మారింది. బ్లాస్టింగ్‌లతో గోడలు బీటలువారి ఇండ్లు పడిపోతున్నాయి. తమకు మరోచోట ఇళ్లు కట్టించి ఆదుకోవాలని… బాధితులు ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. అయితే, ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి… సమస్యకు పరిష్కరం చూపే దిశగా ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఎమ్మెల్యే వీరయ్య.

డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం వెయిటింగ్‌!

నియోజవర్గంలో నిరుపేదలకు సొంతింటి కల… కలగానే మారేట్టుంది. సత్తుపల్లిలో 7వేల600 మంది అర్హులు డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకూ మండలానికి వంద కూడా మంజూరు కాలేదని.. లబ్దిదారులు అసంతృప్తిగా ఉన్నారు

సంక్షేమం బానే ఉన్నా… మరోవైపు అభివృద్ధి జరుగుతున్నా… అదేస్థాయిలో సత్తుపల్లిని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మరి, వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ ప్రభావం చూపిస్తాయా? వీరయ్యను వీక్‌ చేస్తాయా? ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతాయా? అనేది తెలియాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..