Telangana: ఈడీ ప్రశ్నలకు కవిత చెప్పిన సమాధానాలివే.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. సుమారు 9 గంటల పాటు..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు వార్తలు వచ్చాయి. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్‌ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు సమచారం.
ఇదిలా ఉంటే కవిత ఈడీ విచారణపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణలో కవిత సహకరించలేదనని తమకు సమాచారం ఉందని బాంబు పేల్చారు. ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నిస్తే, ఏమో తెలియదు, గుర్తులేదు అని కవిత సమాధానాలు చెప్పిందన్నారు ఎంపీ అరవింద్. ఈడీ విచారణకు సహకరించక పోతే కవితను త్వరగా అరెస్ట్ చేస్తారని ఆయన అన్నారు. తప్పు చేసినందుకే బీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడుతున్నారని అరవింద్ కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే శనివారం ఈడీ విచారణకు హాజరైన కవితను మరోసారి 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈడీ విచారణ ముగిసిన వెంటనే హైదరాబాద్‌కు వచ్చిన కవిత.. సోమవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈడీ అధికారుల విచారణకు సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు కవిత వివరించాని వార్తలు వచ్చాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..