AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు బంపరాఫర్‌.. హెలికాప్టర్‌లో నగరమంతా చక్కర్లు. ధరెంతో తెలుసా?

పర్యాటక ప్రదేశాలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. నగర వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు, జూ పార్కులు వంటి ఎన్నో టూరిస్ట్‌ ప్లేసెస్‌ ఉన్నాయి. దీంతో నగర ప్రజలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన..

Hyderabad: హైదరాబాదీలకు బంపరాఫర్‌.. హెలికాప్టర్‌లో నగరమంతా చక్కర్లు. ధరెంతో తెలుసా?
Hyderabad Helicopter
Narender Vaitla
|

Updated on: Mar 12, 2023 | 7:28 PM

Share

పర్యాటక ప్రదేశాలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. నగర వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు, జూ పార్కులు వంటి ఎన్నో టూరిస్ట్‌ ప్లేసెస్‌ ఉన్నాయి. దీంతో నగర ప్రజలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన ఎంతో మంది భాగ్యనగరానికి క్యూకడుతుంటారు. ప్రత్యేక ప్యాకేజీల ద్వారా పర్యాటకలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంస్థ భాగ్య నగరంలో హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టే అవకాశాన్ని కల్పించింది.

ఫ్లై హైదరాబాద్‌ పేరుతో కొత్త జాయ్‌ రైడ్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మార్చి 8 నుంచి 13వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. బుద్ద విగ్రహంతో పాటు, నెక్లెస్ రోడ్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ప్యాలెస్‌ ప్రాంతాల గుండా హెలికాప్టర్‌ రైడ్‌ ఉంటుంది. హెలికాప్టర్‌లో ప్రయణిస్తూ ఈ ప్రదేశాలను వీక్షించవచ్చు. 10 నిమిషాల పాటు సాగే హెలికాప్టర్‌ రైడ్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నగరాన్ని వీక్షించవచ్చు.

Hyderabad 1

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్ వాటర్ పార్క్ పక్కన దీనిని ఏర్పాటు చేశారు. టికెట్ ధరను ఒక్కొక్కరికి రూ.6,500గా నిర్ణయించారు. బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం 9797798999, 8328572041 నెంబర్లను సంప్రదించవచ్చు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..