Hyderabad: అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంటలు.. ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధిలో ఆదివారం (మార్చి 12) రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పార్క్ సమీపంలోని ఓ కట్టెల గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Fire Accident
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధిలో ఆదివారం (మార్చి 12) రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పార్క్ సమీపంలోని ఓ కట్టెల గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే కట్టెలు అడ్డుగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సిబ్బంది, పోలీసులు మూడు గంటలకు పైగా శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో ముందు జాగ్రత్తగా గోడౌన్‌కు చుట్టుపక్కల వున్న నివాస గృహాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
