Half Day Schools : మండుతున్న ఎండలు.. ఒంటిపూట బడులపై సర్కార్‌ తాజా నిర్ణయం..! ఎప్పటి నుంచంటే..

బాబోయ్‌ ఎండలు భగ్గుమంటున్నాయి.. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే.. వడగాలులు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో

Half Day Schools : మండుతున్న ఎండలు.. ఒంటిపూట బడులపై సర్కార్‌ తాజా నిర్ణయం..! ఎప్పటి నుంచంటే..
Half Day Schools

Updated on: Mar 06, 2025 | 9:56 AM

అసలు ఎండాకాలం ఇంకా ముందే ఉంది.. ఫిబ్రవరి ఆఖరు, మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండల తీవ్రమవుతున్న ఎక్కువవుతుంది. దీంతో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు.

మరోవైపు కొన్న ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 35 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ఈ నెల 15కు ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే రంజాన్‌ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి