Telangana: కాసేపట్లో వివాహమనగా వరుడికి ఊహించని షాక్‌.. రంగంలోకి దిగిన పోలీసులు.

వివాహానికి అంత సిద్ధమై మరికాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన సమయంలో రంగంలోకి పోలీసులు దిగుతారు. మూడు మూళ్లు వేయాల్సిన పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి తీసుకుపోతుంటారు. ఇలాంటి సన్నివేశాలు మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే తాజాగా ఇలాంటి సంఘటన నిజ జీవితంలో...

Telangana: కాసేపట్లో వివాహమనగా వరుడికి ఊహించని షాక్‌.. రంగంలోకి దిగిన పోలీసులు.
Representative Image

Updated on: May 22, 2023 | 4:29 PM

వివాహానికి అంత సిద్ధమై మరికాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన సమయంలో రంగంలోకి పోలీసులు దిగుతారు. మూడు మూళ్లు వేయాల్సిన పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి తీసుకుపోతుంటారు. ఇలాంటి సన్నివేశాలు మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే తాజాగా ఇలాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. ఈ విచిత్ర సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మోగ గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. సోమవారం పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. దీంతో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే అదే సమయంలో వరుడు తనను ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన బిచ్చుంద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మారుతి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా వాడుకున్నాడని, తీరా పెళ్లి చేసుకోకుండా.. మరో యువతి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడని ఆరిపిస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే మారుతి గతంలోనూ పలువురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపించాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..