AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్షి పిల్లలకు అదిరేలా బారసాల.. ముత్తైదువులను పిలిచి సంబరంగా వేడుక..!

చిన్నారి పుట్టినరోజు కానుకగా వచ్చిన రెండు పక్షులను సైతం ఆ కుటుంబం అపురూపంగా పెంచుకుంది. అయితే ఆ పక్షులు ఇప్పుడు పిల్లలకు జన్మించాయి. మనుషులుకు నిర్వహించినట్లుగానే వాటికి బారసాలు ఘనంగా జరిపి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు బంధుమిత్రులను పిలిచి, విందు భోజనాలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

పక్షి పిల్లలకు అదిరేలా బారసాల..  ముత్తైదువులను పిలిచి సంబరంగా వేడుక..!
Grand Cradle Ceremony For Birds
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 31, 2025 | 5:31 PM

Share

చిన్నారి పుట్టినరోజు కానుకగా వచ్చిన రెండు పక్షులను సైతం ఆ కుటుంబం అపురూపంగా పెంచుకుంది. అయితే ఆ పక్షులు ఇప్పుడు పిల్లలకు జన్మించాయి. మనుషులుకు నిర్వహించినట్లుగానే వాటికి బారసాలు ఘనంగా జరిపి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు బంధుమిత్రులను పిలిచి, విందు భోజనాలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

జగిత్యాల జిల్లా గోపాలపల్లి గ్రామానికి చెందిన కాసారపు స్వాతి హోమ్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని నడుపుతున్నారు. ఆమె కొడుకు మణికి చిన్నప్పటి నుంచే పక్షులంటే అమితమైన ఇష్టం. ఈ విషయం గమనించిన గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి, మణి పుట్టినరోజు సందర్భంగా రెండు పక్షులను గిఫ్ట్‌గా ఇచ్చారు. వాటికి “రాధాకృష్ణ” అని పేర్లు పెట్టి కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు.

రాధాకృష్ణలు తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. ఆదివారం (ఆగస్టు 31) పుట్టిన ఆ పక్షి పిల్లలకు బారసాల ఘనంగా జరిపారు. ముత్తైదువులను పిలిచి వేడుకను నిర్వహించారు. పక్షుల బారసాలు జరిపిన ఈ కుటుంబం ఇప్పుడు పక్షి ప్రేమికులకు ఆదర్శంగా మారింది. ఎక్కడ కూడా జరగని ఈ వేడుకను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు. ఈ వేడుకను తమ సెల్ ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..