విజయవాడలోని కేదారేశ్వరరావుపేటలో హుసేనా అనే మహిళను ఆమె ప్రియుడు శివకుమార్ దారుణంగా హత్య చేశాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న శివకుమార్, హుసేనాను హత్య చేసి పరారయ్యాడు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది.