Governor Tamilisai: నేడు రాముడి పట్టాభిషేకం.. భద్రాద్రి చేరుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు
Tamilisai Soundararajan: భద్రాద్రి శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు సీతారామచంద్రమూర్తికి మహా పట్టాభిషేకం జరగనుంది.
Tamilisai Soundararajan: భద్రాద్రి శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు సీతారామచంద్రమూర్తికి మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ పట్టాభిషేకం వేడుకలో గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొననున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజుల పర్యటన నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై.. సోమవారం ఉదయం కొత్తగూడెం చేరుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళసై దంపతులు భద్రాచలం చేరుకొని సీతారాముల స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య సైతం స్వాగతం పలికారు. కాగా.. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ గైర్హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమిళసై మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భద్రాచలం దేవస్థానం గురించి.. దాని విశిష్టతను ఆలయ అర్చకులు తనకు తెలిపారని పేర్కొన్నారు. శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకానికి తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. రాముడు చాలా గొప్పవాడని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.
కాగా.. భద్రాద్రి క్షేత్రంలో సాయంత్రం జరిగే రామయ్య పట్టాభిషేకం కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. దీంతోపాటు గిరిజన మహిళల సీమంతం వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం పనితీరును సమీక్షించనున్నారు. దీంతోపాటు నాచారం జయలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
మంగళవారం పూసకుంట, గోగులపూడి గిరిజనులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. అదేవిధంగా మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు.
Boarded the train with our Rajbhavan team for the two days District tour. Thank you @RailMinIndia @GMSRailway pic.twitter.com/8lo0RYfLB2
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 10, 2022
Also Read: