Sri Ramanavami: ఇంద్రకీలాద్రిపై కన్నుల పండువగా.. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై జానకి సమేత జగదభిరాముడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హనుమత్, లక్ష్మణ, సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి పంచలోహ విగ్రహాలకు సంప్రోక్షణ...
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై జానకి సమేత జగదభిరాముడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హనుమత్, లక్ష్మణ, సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి పంచలోహ విగ్రహాలకు సంప్రోక్షణ నిర్వహించి కల్యాణంలో వినియోగించారు. ఇలా చేయడం మొదటి సారి కావడం విశేషం. రాజగోపుర ప్రాంగణంలో సీతారాములను వధూవరులుగా అలంకరించారు. సంప్రదాయబద్ధంగా వేదపండితుల మంత్రాల మధ్య ఘనంగా సీతా పరిణయ వేడుక నిర్వహించారు. భద్రాచలం(Bhadrachalam) లోనూ శ్రీసీతారాముల కల్యాణం నేత్ర పర్వంగా జరిగింది. నీలిమేఘశ్యాముడికి సుప్రభాతం పలికి ఆరాధించారు. అనంతరం మూలవరులకు అభిషేకం చేసి, సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణమూర్తులను సుందరంగా అలంకరించి జయజయ నీరాజనాల మధ్య మాడ వీధిలో ఊరేగిస్తూ మిథిలా మండపానికి తీసుకువచ్చారు. స్వామివారి పల్లకీని తాకేందుకు భక్తులు ఎగబడ్డారు. మిథిలా ప్రాంగణం నుంచి అర్చకుల ప్రవచనాలు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తాయి.
రెండేళ్ల కరోనా కష్టాలు తీరి ఇప్పుడు ప్రజల మధ్య శ్రీరామనవమి వేడుక నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం కల్యాణం వీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసిందని చెప్పారు. సంప్రదాయం ప్రకారం టీటీడీ నుంచి ఏటా పట్టు వస్త్రాలు అందిస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దీన్ని కొనసాగించారని తెలిపారు. భద్రాచలంలోని గోశాల అభివృద్ధికి అవసరమైన సాయం అందిస్తామన్నారు. శృంగేరీ పీఠంతో పాటు పలుచోట్ల నుంచి దేవదేవుడికి వస్త్ర, కనక, నగదు రూపేణా కానుకలు వెల్లువెత్తాయని స్థానాచార్యుడు స్థలసాయి ప్రకటించారు.
Also Read
Viral Video: చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్ చేస్తోన్న బుల్లి పప్పీ !!