Astro Tips: ఏఏ దేవతలకు ఎలాంటి పుష్పాలు సమర్పించాలి, ఏఏ పుష్పాలను సమర్పించకూడదంటే..
Astro Tips: హిందువులు దేవుడిని పూజించడానికి పూలను ఉపయోగిస్తారు. సనాతన ధర్మం ప్రకారం.. పువ్వులు లేని పూజ అసంపూర్ణం. పువ్వులు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు..
Astro Tips: హిందువులు దేవుడిని పూజించడానికి పూలను ఉపయోగిస్తారు. సనాతన ధర్మం ప్రకారం.. పువ్వులు లేని పూజ అసంపూర్ణం. పువ్వులు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. భగవంతుడిని పూజించే సమయంలో.. దేవతలకు ఇష్టమైన పుష్పాలను (Astro Tips) వారికి సమర్పిస్తారు. దీంతో భగవంతుడు సంతోషించి తాము కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అంతేకాదు పువ్వుల పరిమళముతో ఇంటిలో ప్రశాంతత నెలకొంటుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అయితే ఏ పూజ సమయంలో ఏఏ దేవతలకు ఎలాంటి పుష్పాలు సమర్పించాలో తెలుసుకుందాం .
తెలుపు రంగు పువ్వులు: సరస్వతీ దేవికి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం. తెలుపు రంగు పువ్వులు లేకుండా సరస్వతీ దేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందువల్ల, సరస్వతీ దేవి అనుగ్రహం పొందడానికి, మీరు సరస్వతీ దేవికి తెల్లటి పుష్పాలను సమర్పించవచ్చు.
మల్లెపువ్వులు: ఈ చిన్న పువ్వులు చాలా సువాసనగా ఉంటాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మల్లెపూలను సమర్పించాలి. ఈ పూలకు ఔషధ విలువలు కూడా ఉన్నాయి.
తామరపువ్వు: లక్ష్మీదేవికి తామరపువ్వు చాలా ప్రీతికరమైనదని భక్తుల నమ్మకం. ఈ పూలను లక్ష్మీ పూజ లేదా దీపావళి సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తామరపువ్వుతో లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆ ఇల్లు సుఖ సంతోషాలకు సంపదతో తులతూగుతుందని నమ్మకం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, మీ ఇంటి పూజ గదిలో తామర గింజల దండను ఉంచండి.
ఎరుపు మందార: కాళీ దేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కాళీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు మందార పువ్వులను సమర్పించండి.
పారిజాతం: ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఈ పువ్వులు చాలా సువాసనగా ఉంటాయి. ఈ పూలు రాత్రి పూట పూస్తాయి. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ పువ్వులను సమర్పించవచ్చు. సముద్ర మథనం సమయంలో ఈ పువ్వు జన్మించిందని నమ్మకం. ఈ పువ్వుల్లో అనేక ఔషధ విలువలున్నాయి.
జిల్లేడు పువ్వులు: ఈ పుష్పం శివునికి ప్రీతికరమైనదని విశ్వసిస్తారు. ఈ పువ్వును శివుని పూజించడానికి ఉపయోగిస్తారు.
ఈ పువ్వులను ఈ దేవతలకు సమర్పించవద్దు: అయితే కొన్ని పువ్వులను కొందరు దేవతలకు దేవుళ్ళకు సమర్పించడం వలన కష్టాలు ఇబ్బందులు వస్తాయని నమ్మకం.
విష్ణుపూజకు అవిసె పుష్పాన్ని ఎప్పుడూ ఉపయోగించవద్దు.
శివుడు మొగలి పువ్వు పూజార్హం కాదు
పార్వతి దేవిని పూజించేటప్పుడు ఉసిరిని ఎప్పుడూ సమర్పించవద్దు
సూర్యభగవానుని పూజించేటప్పుడు ఎప్పుడూ బిల్వ పత్రాలను సమర్పించవద్దు.
కరివేరు పువ్వులను రాముడికి ఎప్పుడూ సమర్పించకూడదు.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: Startup Companies: స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ.. మూడు నెలల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే..