TTD News: అన్నమయ్యను టీటీడీ అగౌర పరుస్తోందని ప్రచారం.. స్పందించిన అడిషనల్ ఈఓ..
Tirumala News: అన్నమయ్యను టీటీడీ అగౌరపరుస్తోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. గతకొన్ని రోజులుగా జరుగుతోన్న ఈ ప్రచారంపై ధర్మారెడ్డి...
Tirumala News: అన్నమయ్యను టీటీడీ అగౌరపరుస్తోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. గతకొన్ని రోజులుగా జరుగుతోన్న ఈ ప్రచారంపై ధర్మారెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీపై జరుగుతోన్న దుష్ప్రచరాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొంటారని తెలిపారు. అన్నమయ్య వంశీకులకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న గౌరవ మర్యదాలు కల్పిస్తున్నామన్నారు. 25మంది పండితులుతో అన్నమయ్య కీర్తనల పై పరిశోధన నిర్వహిస్తున్నామని వివరించారు.
తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ధర్మారెడ్డి ప్రభుత్వం నూతన జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసిందని చెప్పుకొచ్చారు. ఇక తిరుమలలో స్థానికంగా ఉన్న కొందరి నివాసాలను తొలగించడంపై స్పందించిన ఆయన.. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధులలో మఠాలుతో పాటు స్థానికుల నివాసాలను తొలగించామని తెలిపారు. నివాస ప్రాంతాలను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలలో పునరావాసం కల్పించామని గుర్తు చేశారు.
NVS Class 6 Admit Card 2022: నవోదయ ఆరో తరగతి అడ్మిట్ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!