ఇది కదా ప్రతీకారమంటే.. గత సీజన్‌లో బెంచ్‌కే పరిమితం.. కట్ చేస్తే.. అదే టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన బౌలర్..

ఐపీఎల్(IPL) చివరి సీజన్‌లో బెంచ్ మీద కూర్చోబెట్టిన ప్లేయర్.. 15వ సీజన్‌లో అదే జట్టుపై తీవ్రంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. తన బౌలింగ్‌తో సత్తా చాటే అవకాశం ఉన్నా.. కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా అవమానించారు.

ఇది కదా ప్రతీకారమంటే.. గత సీజన్‌లో బెంచ్‌కే పరిమితం.. కట్ చేస్తే.. అదే టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన బౌలర్..
Ipl 2022, Kuldeep Yadav
Follow us
Venkata Chari

|

Updated on: Apr 11, 2022 | 11:18 AM

ఐపీఎల్(IPL) చివరి సీజన్‌లో బెంచ్ మీద కూర్చోబెట్టిన ప్లేయర్.. 15వ సీజన్‌లో అదే జట్టుపై తీవ్రంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. తన బౌలింగ్‌తో సత్తా చాటే అవకాశం ఉన్నా.. కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా అవమానించారు. దీంతో ఎంతో కసిగా మంచి అవకాశం కోసం ఎదురుచూసిన ఆ ప్లేయర్‌కు.. నిన్న ఓ చక్కని అవకాశం వచ్చింది. దీంతో రెచ్చిపోయిన ఆ బౌలర్.. గత సీజన్లో ఆడిన జట్టును చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్లేయర్ ఎవరా అని అనుకుంటున్నారా? చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) గురించే మేం చెబుతుంది. అతడిని బెంచ్ మీద ఉంచిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) నిలిచింది. నిజానికి గత సీజన్‌లో కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్ డగౌట్‌లో కూర్చున్నాడు. IPL 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో కుల్దీప్ యాదవ్ చేరాడు. ఇక 15వ సీజన్‌లో కోల్‌కతా, ఢిల్లీ జట్టు తొలిసారిగా ముఖాముఖి తలపడినప్పుడు.. తనను బెంచ్‌పై కూర్చోబెట్టి కోల్‌కతా ఎంత పెద్ద తప్పు చేసిందో రుచి చూపించాడు.

ఏప్రిల్ 10 సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. 4 మ్యాచ్‌ల తర్వాత లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో విజయం. 4 ఓవర్లలోనే ప్రతీకారం తీర్చుకునేలా బలమైన దాడి చేసిన కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.

కుల్దీప్ అద్భుత ప్రదర్శన..

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న కుల్దీప్ యాదవ్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 35 పరుగులకు నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఇందులో KKR కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా ఉంది. ఈ ఘనత కారణంగా వరుసగా రెండు పరాజయాల తర్వాత ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా హీరో ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

KKRకి వ్యతిరేకంగా అత్యుత్తమ ప్రదర్శన..

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2022లో, అతను ఇప్పటివరకు ఏ మ్యాచ్‌లోనూ 4 వికెట్లు తీయలేదు. 15వ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీయగా, అందులో 35 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమంగా నిలిచింది. ఈ ప్రదర్శన తర్వాత, అతను పర్పుల్ క్యాప్ రేసులో రెండవ స్థానంలో నిలిచాడు.

కోల్‌కతాపై కుల్దీప్ నాలుగు వికెట్లు పడగొట్టడంలో శ్రేయాస్ అయ్యర్ అతిపెద్ద బాధితుడుగా మారాడు. నాలుగు వికెట్లలో ముందుగా కేకేఆర్ కెప్టెన్‌ను కుల్దీప్ తన భాదితుడిగా మార్చాడు. ఈ వికెట్ తీయడంతో మ్యాచ్ మొత్తం ఢిల్లీ కంట్రోల్‌కి వచ్చింది.

Also Read: India vs Pakistan: రూ. 57 బిలియన్ల ప్లాన్‌.. షాకిచ్చిన ఐసీసీ.. బొక్కబోర్లాపడిన పాకిస్థాన్

SRH vs GT Playing XI IPL 2022: గుజరాత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో వీరికి చోటు?