Telangana: ఇదెక్కడి మూర్ఖత్వం.. రోడ్డు వేయమంటే ఊరినే ఖాళీ చేయమంటున్న అధికారులు..

|

Jan 31, 2023 | 9:47 AM

తమ గ్రామానికి రోడ్డు వేయండని అడగడమే పాపమైంది. రోడ్డు వేయమన్నందుకు ఏకంగా ఊరునే ఖాళీ చేయమంటున్నారు అధికారులు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ గ్రామానికి ఎదురైందీ..

Telangana: ఇదెక్కడి మూర్ఖత్వం.. రోడ్డు వేయమంటే ఊరినే ఖాళీ చేయమంటున్న అధికారులు..
Telangana Villages
Follow us on

తమ గ్రామానికి రోడ్డు వేయండని అడగడమే పాపమైంది. రోడ్డు వేయమన్నందుకు ఏకంగా ఊరునే ఖాళీ చేయమంటున్నారు అధికారులు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ గ్రామానికి ఎదురైందీ పరిస్థితి. గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగింది అధికార యంత్రాంగం. మీ గ్రామానికి రోడ్డు వేయలేం.. ఊరునే ఖాళీ చేయండంటూ అల్టిమేటం ఇచ్చారు. దాంతో, దిక్కుతోచనిస్థితిలో పడ్డారు గ్రామస్తులు.

ఇక్కడే పుట్టాం-ఇక్కడే చస్తాం..

రోడ్డు వేయమంటే, ఊరునే ఖాళీ చేయమంటారా? ఇదెక్కడి దారుణమంటున్నారు దొరవారి తిమ్మాపురం గ్రామస్తులు. రోడ్డు వేయకపోయినా ఫర్వాలేదు, కానీ ఊరుని వదిలివెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తామని, తమ ప్రాణాలు తీసినా ఊరును ఖాళీ చేసేది లేదంటూ ఆందోళనకు దిగారు. ఇక్కడే తమ జీవితం, తమ బతుకు అంటూ తెగేసి చెబుతున్నారు గిరిజనులు.

అధికారుల మూర్ఖత్వంతో ప్రమాదంలో ఊరి భవితవ్యం..

30ఇళ్లు, 128మంది జనాభా, 350 ఎకరాల సాగుభూమి ఉన్న దొరవారి తిమ్మాపురం గ్రామానికి 4వందల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, రోడ్డు సౌకర్యం మాత్రం లేదు. దాంతో, తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నారు గ్రామస్తులు. అయితే, అటవీశాఖ అడ్డుపుల్ల వేయడంతో మొత్తం గ్రామాన్నే లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అధికారుల మూర్ఖత్వంతో ఊరి భవితవ్యమే ప్రమాదంలో పడింది. అయితే, ఏం చేసినాసరే ఇక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు గిరిజనులు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ, గ్రామాన్ని మాత్రం ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇక్కడే పుట్టాం-ఇక్కడే చస్తాం, తమ జీవితం-తమ బతుకు ఇక్కడే అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వివాదం మరింత ముదురుతుండటంతో.. గ్రామస్తులతో అధికారులు చర్చలు జరిపారు. అయితే, దొరవారి తిమ్మాపురం గ్రామస్తులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మీకు మరో చోట ఇళ్లు కట్టిస్తాం, ఊరును ఖాళీ చేయండంటూ అధికారులు పెట్టిన ప్రతిపాదనను గ్రామస్తులు తిరస్కరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..