Telangana: ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చాడు.. పత్తా లేకుండా పోయాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!

Telangana: భువనగిరి జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వైద్యుడి నిర్లక్ష్యం 10మంది మహిళలను అపాయంలో పడేసింది.

Telangana: ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చాడు.. పత్తా లేకుండా పోయాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!
Doctor

Updated on: Mar 27, 2022 | 5:50 AM

Telangana: భువనగిరి జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వైద్యుడి నిర్లక్ష్యం 10మంది మహిళలను అపాయంలో పడేసింది. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు డాక్టర్‌…. ఆపరేషన్ కోసమని వచ్చిన 10మంది మహిళలకు మత్తు ఇంజెక్షన్‌లు ఇచ్చాడు. కానీ, వారికి ఆపరేషన్ చేయనని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. పేషెంట్స్‌కు‌ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వెళ్లడంతో బాధిత మహిళలు ఉదయం నుండి ఆసుపత్రి వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. వైద్యుడి నిర్వాకంతో ఆసుపత్రి ఎదుట బాధిత మహిళలు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకెళితే.. తుర్కపల్లి, రాజపేట పి.హెచ్.సిల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మహిళలను జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు ఏ.ఎన్.ఎమ్ లు. డిపిఎల్ క్యాంప్ లో భాగంగా మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు వైద్య సిబ్బంది. అయితే, ఆపరేషన్‌ చేయకుండా వెళ్లిపోయిన డాక్టర్‌కు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఆ తర్వాత తెలిసినట్టు సమాచారం. కానీ, మహిళలకు ఎవరికీ ఎలాంటి అపాయం కలగపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

Yadadri Temple: యాదాద్రి ఆలయానికి ఇంత ప్రొటెక్షనా?.. భద్రతా వ్యవస్థ ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Telangana: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. పెళ్లి వేళ ట్విస్ట్ ఇచ్చాడు.. మరి ఆ యువతి ఏం చేసిందంటే..!

Yadadri Temple: నవ వైకుంఠం మన యాదాద్రి.. ఇక్కడి విగ్రహాలు, గోపురాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..!