మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు.. దిగువకు పొటెత్తిన వరద

|

Oct 15, 2024 | 1:20 PM

జలాశయాల‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో... జ‌ల‌మండ‌లికి సంబంధించిన అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలని కోరారు.

మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు.. దిగువకు పొటెత్తిన వరద
Twin Reservoirs
Follow us on

హైదరాబాద్ జంట జలాశయాల అన్ని గేట్లు తెరుచుకున్నాయి. జంట జలాశాలకు ఎగువనుంచి వస్తున్న ఉధృతితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ నిండుకుండలా మారాయి. వరద ప్రవాహంతో రెండు డ్యాంల్లో ఫుల్‌ ట్యాంక్‌ లెవర్‌ నీరు చేరడంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తారు. ఎగువన వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో జంట జ‌లాశయాల రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌ర‌ద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా జ‌ల‌మండ‌లి ఉస్మాన్ సాగ‌ర్ రెండు గేట్ల‌ను పైకి ఎత్తి 247 క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదిలారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

అటు హిమాయత్ సాగర్ పదో నెంబర్ గేటును ఒక ఫీట్‌ మేరకు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయాల‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో… జ‌ల‌మండ‌లికి సంబంధించిన అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..