తెలంగాణ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీఆర్‌ఏల రెగ్యులరైజ్‌తో వారి జీవితాలకు భరోసా నిచ్చిన ప్రభుత్వం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్లకు సంబంధించి మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది.గత కొన్నేళ్లుగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. రేషన్ డీలర్లను కూడా ఇకపై కారుణ్య నియామకం ద్వారా ఎంపిక చేసే వెసులుబాటును కల్పించింది. దీని ప్రకారం.. ఎవరైనా డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబసభ్యుల్లో ఒకరికి డీలర్‌షిప్ ఇచ్చేందుకు అర్హత వయస్సు పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 40 ఏళ్ల వరకు ఉన్న డీలర్‌షిప్‌కు అర్హత వయస్సు పరిమితిని మరో పదేళ్లు అంటే 50 ఏళ్లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ జూన్ 16న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. డీలర్ మరణించిన తర్వాత రెండు సంవత్సరాలకు ఈ నిబంధనతో సంబంధం లేకుండా డీలర్‌షిప్‌ను కేటాయించనున్నారు. అయితే డీలర్ మరణించిన వెంటనే సదరు అర్హత కలిగిన వ్యక్తి డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవటం తప్పనిసరి. అంతేకాదు..రేషన్ డీలర్ షిప్ పొందే వ్యక్తికి కచ్చితంగా 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలన్నది తప్పనిసరి నిబంధన. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..