Telangana: తెలంగాణలోని మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త బ్రాండ్లు.. కిక్కే కిక్కు..
తెలంగాణలోని మందుబాబులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను చూడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో దేశీయ, లోకల్ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. త్వరలోనే ఇవి మార్కోట్లోకి రానున్నాయి.

తెలంగాణలోని మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో త్వరలో ఫారిన్ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్ల మద్యంను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో దేశీయ, లోకల్ బ్రాండ్ల కంపెనీల మద్యం అందుబాటులో ఉంది. త్వరలోనే ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్లు కూడా రానుండటం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌గా చెప్పవచ్చు. విదేశీ బీర్లు, వైన్ వంటివి రాష్ట్రంలోకి రానున్నాయి. 18 కంపెనీలకు చెందిన 121 మద్యం బ్రాండ్లకు తాజాగా ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బ్రాండ్లకు సంబంధించిన వివరాలు ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్లో అందుబాటులోకి ఉన్నాయి.
అందుబాటులో మరిన్ని బ్రాండ్లు..
ఈ కొత్త ఇంటర్నేషనల్ బ్రాండ్లను తెలంగాణలోని వినియోగదారులకు చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఇప్పటికే వీటికి సంబంధించి పబ్లిక్ నోటీస్ జారీ చేసిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్.. సెప్టెంబర్ 1 నాటికి అభ్యంతరాలు సమర్పించాలని కోరింది. కొత్తగా అనుమతి ఇచ్చిన మద్యం బ్రాండ్లలో సింగిల్ మార్ట్ విస్కీ, హెండ్రిక్స్ జిన్, మంకీ షోల్డర్, టైగర్ లాగర్ బీర్లు కొరియన్, జర్మన్ బ్రాండ్లు వంటివి ఉన్నాయి. ఇక దేశీయ బ్రాండ్లు అయిన ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, రీకో, వల్లోన్ కంపెనీల బ్రాండ్ల కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి రాష్ట్రంలో మందుబాబులకు మరిన్ని దేశీయ, విదేశీ బ్రాండ్లు అందుబాటులోకి రానుండటంతో.. ఇది కిక్కిచ్చే వార్తగా చెప్పవచ్చు.
పెరగనున్న మద్యం ధరలు
అటు రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యం తయారీ కంపెనీలతో చర్చలు కూడా జరిపింది. కంపెనీల డిమాండ్లను కూడా పరిశీలించి అధ్యయనం చేపట్టింది. అనంతరం ధరలు పెంచాలని ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వం ప్రస్తుతం సమాలోచనలు చేస్తోంది. ఎంతవరకు ధరలు పెంచాలనే దానిపై చర్చలు జరుపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకసారి మద్యం ధరలను పెంచింది. ఇప్పుడు మరోసారి పెంచితే మందుబాబుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆలోచిస్తోంది. అయితే మద్యం తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని, అంతర్జాతీయంగా ఉద్రిక్తతల వల్ల ఖర్చులు పెరిగిపోయాయని కంపెనీలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.
