AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయిందా..? అసలు నిజం ఇదే!

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయిందన్న వార్తలను జలమండలి ఖండించింది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో నీటి సంపులు పూర్తిస్థాయిలో ఉన్నాయని తేలింది. సచివాలయానికి నిరంతరం నీటి సరఫరా జరుగుతోందని, ఎలాంటి అంతరాయం లేదని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయిందా..? అసలు నిజం ఇదే!
Telangana Secretariat Water Supply
Balaraju Goud
|

Updated on: Oct 05, 2026 | 2:39 PM

Share

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయిందంటూ కొన్ని వార్తా ఛానళ్లలో ప్రసారమైన కథనాలపై హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (జలమండలి) స్పందించింది. సచివాలయానికి జలమండలి నుంచి అందించే మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి స్పష్టం చేశారు.

సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయిందన్న సమాచారం వెలువడిన వెంటనే జలమండలి అధికారులు స్పందించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సచివాలయంలోని మంచినీటి సంపును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీల్లో సంపులో నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సచివాలయానికి నీటి సరఫరా నిలిచిపోయిందన్న వార్తల్లో వాస్తవం లేదని జలమండలి స్పష్టం చేసింది.

జలమండలి నుంచి సచివాలయానికి రోజువారీగా అందించే మంచినీటి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్య, సరఫరా అంతరాయం లేదని పేర్కొన్నారు. సచివాలయంలోని నీటి సంపును ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి వెల్లడించారు.

అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో నీటి నిల్వలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తేలడంతో సచివాలయానికి నీటి సరఫరాపై వస్తున్న అనుమానాలకు జలమండలి తెరదించింది. ప్రజలు, సిబ్బంది ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us