తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతోంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పదేపదే చెప్పినా.. వాహనదారులు పెడచెవిన పెట్టేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రాంగ్ రూట్‌లో వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నపడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో వారి పేరుపై ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. చలాన్లు పడుతున్నా వాటినిన కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు వాహనదారులు. దీంతో రాష్ట్రంలో పెండింగ్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లీయర్ చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రాయితీని ఇచ్చారు.
దాదాపు 70 శాతం వరకు రాయితీ ఇవ్వడంతో చాలా మంది పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించారు. ఇప్పుడు తాజాగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు రంగం సిద్ధం చేస్తోంది. భారీగా రాయితీ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది.గత ఏడాది ఇచ్చిన రాయతీ వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లు ఏకంగా రూ.300 కోట్ల వరకూ వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్నతరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి కావడంతో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి చలానాలు విధిస్తున్నారు. ఈ చలానాలను వాహనదాలు చెల్లించడం లేదు. వాటిని వసూలు చేసే దిశగా ట్రాఫిక్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్‌లో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారికి రాయితీలు ఇస్తూ వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ కల్పించారు పోలీసులు. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న చలానాలను క్లీయర్ చేసుకునేందుకు రాయతీని కల్పించనున్నారు ట్రాఫిక్ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి