Telangana: తెలంగాణ మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్‌ పెంచిన సర్కార్‌.. ఎంత శాతమంటే?

|

May 28, 2023 | 7:19 AM

తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Telangana: తెలంగాణ మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్‌ పెంచిన సర్కార్‌.. ఎంత శాతమంటే?
Medical Students
Follow us on

హౌస్‌ సర్జన్లు, పీజీలు, సీనియర్‌ రెసిడెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపకార వేతనం 15శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి ఉపకార వేతనం పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో.. తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ గతంలోనే వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆర్థిక శాఖ అనుమతితో వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా.. వైద్య విద్యార్థులు.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లకు 22,527 నుంచి 25,906కు స్టైపండ్ పెంచారు. పీజీ ఫస్టియర్‌ విద్యార్థులకు 50,385 నుంచి 58,289, సెకండియర్‌ విద్యార్థులకు 53,503 నుంచి 61,528, థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులకు 56,319 నుంచి 64,767కి స్టైపెండ్‌ పెరగనుంది.

 

ఇవి కూడా చదవండి

కాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు.. మహబూబ్‌ నగర్‌ జిల్లా అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 వేల బెడ్స్ ఉండేవని.. వాటి సంఖ్యను 50 వేలకు పెంచామని హరీశ్ తెలిపారు. గత ఐదేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..