
తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గానికి (Gajwel Asssembly Election) సీఎం కేసీఆర్ (CM KCR) ఇలాకాగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలిచారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక తెలంగాణ నేతగా చరిత్ర సృష్టించారు.
2023 ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామా రెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్.. గజ్వేల్‌లో మాత్రం 45031 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 66653 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డికి 32568 ఓట్లు పోలయ్యాయి.
గజ్వేల్ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లో ఒకటి. ప్రస్తుతం రెండు జిల్లాలు సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో గజ్వేల్ నియోజకవర్గ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. సిద్ధిపేటలోని గజ్వేల్, కొండపాక, వార్గల్, ములుగ్, జగదేవ్‌పూర్ మండలాలు, మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంటేరు ప్రతాప రెడ్డిపై కేసీఆర్ 20వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ వరుసగా రెండోసారి గజ్వేల్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంటేరు ప్రతాప రెడ్డిపై 56,922 ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో కేసీఆర్‌కు 120608 ఓట్లు రాగా.. వంటేరుకు 63,686, బీజేపీ అభ్యర్థి ఆకుల విజయకు 15 వేల ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత వంటేరు రాజకీయ పరిణామాల్లో వంటేరు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. గతంలో గీతా రెడ్డి, సంజీవ రావు, విజయ రామారావు తదితర రాజకీయ ప్రముఖులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,27,333 మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్