AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ కూడా ఫ్రీ బస్

NEET-UG 2026 పునఃపరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 21న పరీక్ష రాసే అభ్యర్థులు TGSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

TGSRTC: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ కూడా ఫ్రీ బస్
Free Bus For Neet Students
SN Pasha
|

Updated on: Jun 17, 2026 | 8:13 PM

Share

జూన్ 21న నిర్వహించనున్న NEET-UG 2026 రీ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని ప్రకటించింది. పరీక్ష రాసే అభ్యర్థులు అదే రోజు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు చేరుకోవడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 16న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను NSUI రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి కలిసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక జూన్ 17న మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామం నుంచి కరీంనగర్ నగరానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, ఇతర ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET-UG 2026 పరీక్ష నిర్వహణలో పలు విద్యార్థి-హిత మార్పులను ప్రకటించింది. పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచి మొత్తం 195 నిమిషాలుగా నిర్ణయించింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది.

పరీక్ష ప్రారంభం, ముగింపు సమయంలో అభ్యర్థుల సంతకాలు వంటి అధికారిక ప్రక్రియల కోసం అదనపు సమయం కేటాయించినట్లు NTA తెలిపింది. గతంలో ఈ ప్రక్రియల వల్ల విద్యార్థుల రాత సమయం తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే ప్రశ్నపత్రంలో రఫ్ వర్క్ కోసం కేటాయించే పేజీల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచింది. దీంతో గణిత, ఫిజిక్స్ లెక్కలు మరియు రీజనింగ్ ప్రశ్నలకు అవసరమైన గణనలను చేసుకునేందుకు విద్యార్థులకు మరింత స్థలం లభించనుంది. ఈ మార్పులు పరీక్ష రాసే అభ్యర్థులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశముందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ విద్యార్థులకు ఫ్రీ బస్.. మంత్రి ప్రకటన
ఆ విద్యార్థులకు ఫ్రీ బస్.. మంత్రి ప్రకటన
12 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి, షెఫాలీ జోడీ.. అదేంటంటే?
12 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి, షెఫాలీ జోడీ.. అదేంటంటే?
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్